మహేష్ బాబు - రాజమౌళి మూవీ "భారీ" అప్ డేట్స్ ఇవే!

ప్రస్తుతం టాలీవుడ్‌ తోపాటు పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది మహేష్ బాబు, రాజమౌళి మూవీ

Update: 2024-01-02 05:01 GMT

ప్రస్తుతం టాలీవుడ్‌ తోపాటు పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది మహేష్ బాబు, రాజమౌళి మూవీ. ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. ఆస్కార్ వేదికపై మెరిసిన అనంతరం రాబోతున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది ఆసక్తికరమైన అంశం. ఈ క్రమంలోనే ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఈ మూవీకి సంబంధించి భారీ అప్ డేట్స్ తెరపైకి వచ్చాయి.

అవును... మహేష్ బాబు - ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లోని మూవీకోసం సినిమా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో అన్నీ అనుకూలంగా జరిగితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావొచ్చని తెలుస్తుంది. ఈ సమయంలో అంతకంటే ముందు రాజమౌళి ఒక ప్రత్యేక వర్క్‌ షాప్‌ ని ప్లాన్ చేసారని.. దీనికి మహేష్ బాబుతో పాటు టీం మొత్తం హాజరుకానున్నారని అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుందని తెలుస్తుండగా.. ప్రధానంగా అమెజాన్ అడవుల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని అంటున్నారు. ఈ సమయంలో ఇప్పటికే ఆ అడవుల్లోని కొన్ని లొకేషన్స్ ని రాజమౌళి సర్కిల్ చేశారని తెలుస్తుంది. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో కెఎల్ నారాయణతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ పై ఒక భారీ నెంబర్ తాజాగా తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... తొలి అంచనాల ప్రకారం ఈ చిత్రాన్ని రూ.1500 కోట్ల బడ్జెట్‌ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్ వేయనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్లోనే జరగనున్నట్లు సమాచారం. దీంతో రాజమౌళి మార్కు "భారీ"తనం ఈ సినిమాలో పుష్కలంగా కనిపించనుందనే కామెంట్స్ మొదలైపోయాయి!

కాగా... మహేష్ బాబు లేటెస్ట్ మూవీ "గుంటూరు కారం" సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ వారం రోజులూ ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రిన్స్ బిజీగా ఉండబోతున్నాడని అంటున్నారు!

Tags:    

Similar News