.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

రాజ‌మౌళి హాలీవుడ్ రీమేక్ గురించి ఏం తెలుసు?

అయితే సౌత్‌లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ఓ చిత్రం హాలీవుడ్ మూవీకి రీమేక్ అన్న సంగ‌తి మీకు తెలుసా?

Update: 2024-06-30 12:37 GMT

బాహుబలి, RRR లాంటి పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన రాజ‌మౌళి అంత‌కుముందు తెలుగు రాష్ట్రాల్లో బంప‌ర్ హిట్లు కొట్టిన సినిమాల‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. జ‌క్క‌న్న‌ యాక్షన్ డ్రామా చిత్రాలతో ఎప్పుడూ సంచ‌ల‌నాలు సృష్టించారు. అయితే సౌత్‌లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ఓ చిత్రం హాలీవుడ్ మూవీకి రీమేక్ అన్న సంగ‌తి మీకు తెలుసా?

2010లో సునీల్‌ ప్రధాన పాత్రలో రాజ‌మౌళి `మర్యాద రామన్న` చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2010లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అయితే ఇది ఒక హాలీవుడ్ మూవీకి రీమేక్. 1923లో వచ్చిన మూకీ చిత్రం `అవర్ హాస్పిటాలిటీ` ఆధారంగా రూపొందింది. బస్టర్ కీటన్ సైలెంట్ కామెడీ `అవర్ హాస్పిటాలిటీ` కాన్సెప్ట్ రాజమౌళికి బాగా నచ్చింది. ఇదే థీమ్ ఆధారంగా దక్షిణాది కోసం ఒక‌ కథను మళ్లీ సృష్టించాలనుకున్నాడు.

అదే స‌మ‌యంలో అత‌డు `అవ‌ర్ హాస్పిటాలిటీ` చిత్రం అసలైన సృష్టికర్తలను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ వారు చాలా కాలం క్రితం మరణించారని సినిమా విడుదలై 75 సంవత్సరాలకు పైగా అయినందున దాని కాపీరైట్ గడువు ముగిసిందని కూడా తెలుసుకున్నారు. SS కాంచి కథను రాజ‌మౌళి స్వీకరించారు. రాయలసీమ నేపథ్యంలో వ‌ర్గ‌ హింస, సీమ ఆతిథ్యం నేప‌థ్యంలో హాస్య ప్ర‌ధాన‌ చిత్రంగా దీనిన మ‌లిచారు.

మొదట ఈ చిత్రంలో కథానాయికగా త్రిష కృష్ణన్‌ని అనుకున్నారు. అయితే సునీల్ హాస్య నటుడు కావడంతో త్రిష ఆ పాత్రను తిరస్కరించింది. అది తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందని ఆమె భావించింది. అటుపై సలోని క‌థానాయిక‌గా ఎంపికైంది. ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించారు. మర్యాద రామన్న బంప‌ర్ హిట్ట‌యింది. తర్వాత పలు భాషల్లోకి రీమేక్‌ అయింది.

Tags:    

Similar News