5గం.లు డిలేపై రాజ‌మౌళిని నిల‌దీసిన జ‌ర్న‌లిస్ట్!

బాహుబలి, బాహుబ‌లి 2, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో సంచ‌ల‌న విజ‌యాల్ని న‌మోదు చేసిన రాజ‌మౌళి త‌దుప‌రి మ‌హేష్ తో భారీ పాన్ ఇండియా చిత్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే

Update: 2024-05-09 05:15 GMT

బాహుబలి, బాహుబ‌లి 2, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో సంచ‌ల‌న విజ‌యాల్ని న‌మోదు చేసిన రాజ‌మౌళి త‌దుప‌రి మ‌హేష్ తో భారీ పాన్ ఇండియా చిత్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశానికి ఆస్కార్ ని తెచ్చిన ఆర్.ఆర్.ఆర్ ద‌ర్శ‌కుడిగా ఆయ‌న పేరు మార్మోగుతోంది. తాజాగా ఎస్ఎస్ రాజమౌళి తన బాహుబలి ఫ్రాంచైజీని అనేక మార్గాలు మాధ్యమాలలో విస్తరించబోతున్నట్లు ధృవీకరించారు. హైదరాబాద్‌లో జ‌రిగిన `బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్`` స‌మావేశంలో రాజ‌మౌళి మీడియాతో ముచ్చ‌టించారు.

అయితే రాజ‌మౌళి ఈ కార్య‌క్ర‌మానికి ఆల‌స్యంగా వ‌చ్చార‌ని మీడియా ప్ర‌శ్నించింది. కెరీర్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి స్టూడెంట్ నంబ‌ర్ 1 నుంచి మీడియా మీతో స్నేహంగా ఉంది. మీరు కూడా అంతే స్నేహంగా ఉన్నారు. ఈరోజు నిర్మాత‌లు సినిమా చేయాలంటే నాలుగైదేళ్లు వెయిట్ చేయాల్సొస్తోంది? నేటి సమావేశం దృష్ట్యా మీడియా మీకోసం ఐదు గంట‌లు వేచి చూసింది. ప్రోగ్రామ్ విష‌యంలో ఎక్క‌డైనా మిస్ క‌మ్యూనికేష‌న్ ఉందా? దీనిపై మీరు కొంత స్ప‌ష్ఠ‌త‌నిస్తార‌ని నేను ఆశిస్తున్నాను..అని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు అడిగారు.

అయితే మీడియా స్నేహానికి రాజ‌మౌళి సింపుల్ గా `థాంక్స్` చెప్పారు. అయితే రెండో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రాజ‌మౌళి త‌న‌కు స‌మావేశ నిర్వాహ‌కులు 5 పీఎం టైమ్ ఇచ్చారని తెలిపారు. అదే స‌మ‌యంలో 1.30 కి జ‌ర్న‌లిస్టులకు ప్రెస్ మీట్ అని చెప్పారని జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు తెలిపారు. ``మీతో మాకు మంచి అనుభ‌వాలున్నాయి..గ‌త స‌మావేశాల‌కు స‌మ‌యానికి మీరు చేరుకున్నారు. కానీ ఇప్పుడే ఈ త‌ప్పు జ‌రిగింది ఎందుకు? స్ప‌ష్ఠ‌త కోసం అడుగున్నాను`` అని జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు ప్ర‌శ్నించారు. కానీ దీనికి స‌రైన జ‌వాబు లేదు.

అయితే కార్య‌క్ర‌మ హోస్ట్ సారీ చెప్పి త‌ర్వాతి ప్ర‌శ్న అడ‌గాల్సిందిగా మీడియాని అభ్య‌ర్థించారు. నిజానికి మేం క్ష‌మాప‌ణ‌లు కోర‌డం లేదు. కేవ‌లం ఎందుకు ఆల‌స్య‌మైందో తెలుసుకోవాల‌ని మాత్ర‌మే అడిగామ‌ని జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు అన్నారు. కానీ దానికి జ‌వాబిచ్చే స్కోప్ లేకుండా త‌దుప‌రి ప్ర‌శ్న అడ‌గాల్సిందిగా హోస్ట్ వారించారు.

భిన్న‌మైన ఆలోచ‌న‌లు చేస్తున్నాం:

బాహుబ‌లి ఫ్రాంఛైజీని విభిన్నంగా విస్తరించడానికి సినిమాలకు అతీతంగా ప్ర‌యోగాల‌కు వెళ్లాల‌ని చూస్తున్నారని రాజమౌళి పేర్కొన్నారు. బాహుబ‌లి నిర్మాత శోబు యార్లగడ్డతో కలిసి తాను దానిపై పని చేస్తున్నానని చెప్పారు. మేము ఇప్పటివరకు బాహుబలి కోసం గేమ్‌లు, VR ఫిల్మ్ సిరీస్‌లను రూపొందించడానికి ప్రయత్నించామని రాజ‌మౌళి తెలిపారు. బాహుబలి కేవలం యానిమేషన్ సిరీస్‌లతోనే కాదు.. అనేక రకాలుగా విభిన్న‌ మాధ్యమాల్లోనూ విస్తరించబోతోంద‌ని కూడా రాజ‌మౌళి అన్నారు.

Tags:    

Similar News