రాజమౌళి రేంజ్.. నెక్స్ట్ ఈ నలుగురేనా?

ఇక రాజమౌళి తర్వాత టాలీవుడ్ నుంచి ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే సత్తా ఉన్న యంగ్ దర్శకులు ఎవరంటే నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-05-24 03:59 GMT
రాజమౌళి రేంజ్.. నెక్స్ట్ ఈ నలుగురేనా?
  • whatsapp icon

టాలీవుడ్ నుంచి ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఉన్న వ్యక్తి రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న గ్లోబల్ లెవల్ లో దర్శకుడిగా విశేషమైన ప్రశంసలు సొంతం చేసుకున్నారు. జేమ్స్ కెమరూన్, స్టీవ్ స్పిల్ బర్గ్ లాంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి మేకింగ్ విజన్ ని ప్రశంసించడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు అందుకోవడం ద్వారా మరో అరుదైన రికార్డుని జక్కన్న సృష్టించారు.

 

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని రాజమౌళి ఇప్పుడు చేస్తున్నారు. ఈ సినిమాతో హాలీవుడ్ లో కూడా తన పేరు వినిపించేలా చేయడానికి జక్కన్న సిద్ధమయ్యారు. ఇక రాజమౌళి తర్వాత టాలీవుడ్ నుంచి ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే సత్తా ఉన్న యంగ్ దర్శకులు ఎవరంటే నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో నాగ్ అశ్విన్ పేరు ఇప్పుడు స్ట్రాంగ్ గా వినిపిస్తోంది.

దీనికి కారణం కల్కి 2898AD. డార్లింగ్ ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. కచ్చితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మహానటి సినిమాతో నేషనల్ వైడ్ గా నాగ్ అశ్విన్ దర్శకుడిగా తన టాలెంట్ చూపించాడు. ఇప్పుడు కల్కి హిట్ అయితే అతని పేరు వరల్డ్ వైడ్ గా రీ సౌండ్ చేయడం గ్యారెంటీ.

యంగ్ డైరెక్టర్ సుజిత్ ఇప్పటికే సాహో మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా ఎంటర్ అయ్యాడు. అయితే ఆ సినిమా మేకింగ్ పరంగా సూపర్ అనిపించుకున్న స్టోరీ పరంగా కొంత నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు OG మూవీతో మేకింగ్ తో పాటు స్టోరీ పరంగా బెస్ట్ అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాపై హోప్స్ ఎక్కువగానే ఉన్నాయి. సుజిత్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అనే పేరు ఇప్పటికే ఉంది. కరెక్ట్ గా రెండు, మూడు హిట్స్ పడితే జక్కన్న రేంజ్ అందుకుంటాడని భావిస్తున్నారు.

యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఒక వర్గం సందీప్ రెడ్డి క్రియేటివిటీ, అతని కథలని తప్పు పడుతున్న మెజారిటీ ఆడియన్స్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని భావిస్తున్నారు. అలాగే హనుమాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ కూడా రాజమౌళి రేంజ్ కి వెళ్తాడని భావిస్తున్నారు. అతని క్రియేటివిటీ, థాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయని, కచ్చితంగా ఇండియా మెచ్చే దర్శకుడిగా మారుతాడని అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ దర్శకులు రాజమౌళి రేంజ్ లో క్రేజ్ అందుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News