మహేష్ నోరు కట్టేసిన రాజమౌళి?
తండ్రి విజయేంద్రప్రసాద్ తో పూర్తి కథను సిద్ధం చేయించినప్పటికీ రాజమౌళి టోటల్ బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో అయితే బిజీగా ఉన్నాడు.
దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా ఎప్పుడు మొదలుపెడతాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలు కావడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. అసలైతే ఈపాటికి సినిమా అనౌన్స్ జరిగి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కావాల్సింది. కానీ రాజమౌళి ఇంకా స్క్రిప్టును పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేదు అని తెలుస్తోంది.
తండ్రి విజయేంద్రప్రసాద్ తో పూర్తి కథను సిద్ధం చేయించినప్పటికీ రాజమౌళి టోటల్ బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో అయితే బిజీగా ఉన్నాడు. మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో మధ్య మధ్యలో ఫిట్నెస్ మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బహుశా రాజమౌళి కోసం కండలు పెంచుతున్నాడేమో అని అందరూ అనుకుంటున్నారు.
ఇక మహేష్ బాబు ఎప్పుడైనా బయటకు వస్తే మాత్రం రాజమౌళి సినిమా ఎప్పుడు అంటూ ఏదైనా అప్డేట్ ఇస్తారా అనే ప్రశ్నలు అయితే గట్టిగానే వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మహేష్ బాబు మాత్రం కొంచెం కూడా హింట్ అయితే ఇవ్వడం లేదు. రాజమౌళి తరహాలో సైలెంట్ గానే ఉంటూ మహేష్ కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ పెద్దగా సమాధానాలు అయితే ఇవ్వడం లేదు.
ఇక రీసెంట్ గా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ప్రమోషన్ లో పాల్గొన్న మహేష్ రాజమౌళితో సినిమా ఎప్పుడు ఏదైనా అప్డేట్ ఇస్తారా అని అడగాగానే ఒకే ఒక్క ముక్కలో 'చెపుతాం సార్..' కాస్త ఓపిక పట్టండి అన్నట్లు మహేష్ అంతటితో ఆ విషయాన్నీ స్మైల్ తో క్లోజ్ చేసేసాడు. బహుశా రాజమౌళి ఏ విషయాన్ని చెప్పకూడదు అని మహేష్ నోరు కట్టేసినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ నటీనటులకు, టెక్నీషియన్లకు అలాగే హీరోలకు రాజమౌళి కండిషన్స్ పెట్టడం సహజమే. సినిమాలోని చిన్న పాయింట్ కూడా లీక్ చేయకూడదు అని అందరికీ కండిషన్స్ అయితే సీరియస్ గా పెట్టేస్తాడు. ఇక మహేష్ బాబుకు కథ మాత్రమే చెప్పిన రాజమౌళి మరోసారి పూర్తిస్థాయిలో స్క్రిప్టు గురించి కూడా చర్చించాల్సి ఉందట. ఇక రాజమౌళి చెప్పకుండా మహేష్ అయితే ఆ ప్రాజెక్టు గురించి నోరు విప్పే అవకాశం అయితే లేదు. ఏదైనా సరే రాజమౌళి నుంచి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సిందే. ఇక గుంటూరు కారం సినిమా జనవరిలో రానుంది. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టు పనులు మొదలుకానున్నాయి.