`కల్కి 2898 AD` కంటే హై VFX మూవీనా?
అంతేకాదు.. `కల్కి 2898 AD` వీఎఫ్ ఎక్స్ కోసం 200 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం ఉంది.
ప్రస్తుతం భారతదేశంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో `కల్కి 2898 AD` భారీ విజువల్ మాయాజాలంతో అలరించే మూవీ అన్న ప్రచారం ఉంది. ఈ సినిమాని దాదాపు 600కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోందని, ప్రభాస్ కెరీర్ బెస్ట్ చిత్రమవుతుందని ప్రచారం సాగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో అడ్వాన్స్ డ్ సాంకేతికతతో చూపించబోతున్నారుని, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారని కూడా గుసగుసలు ఉన్నాయి.
అంతేకాదు.. `కల్కి 2898 AD` వీఎఫ్ ఎక్స్ కోసం 200 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. కల్కి ఇండియన్ సినిమా తెరపై మునుపెన్నడూ చూడని కొత్త కంటెంట్ తో అలరించనుంది. సలార్ తర్వాత ప్రభాస్ కి మరో మైలు రాయి చిత్రంగా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే ఇటీవల ఓ గాసిప్ ఫిలింసర్కిల్స్ లో వైరల్ గా మారింది.
దీని సారాంశం కల్కి సినిమాని మించి ప్రభాస్ నటిస్తున్న `రాజా సాబ్`లో వీఎఫ్ఎక్స్ షాట్స్ ని ఉపయోగిస్తున్నారన్నదే ఆ గుసగుస. అయితే ఇది నిజమేనా? కల్కిని మించి విజువల్ ఎఫెక్ట్స్ తో రాజా సాబ్ మెస్మరైజ్ చేస్తాడా? అంటూ నెటిజనుల్లో డిబేట్లు మొదలయ్యాయి. ప్రాజెక్ట్ కే కంటే హై వీఎఫ్ ఎక్స్ మూవీనా? అంటూ రాజా సాబ్ గురించి ఆరాలు తీస్తున్నారు.
అయితే ఇది నిజమా? అని `రాజా సాబ్` నిర్మాత విశ్వప్రసాద్‌ను ఇటీవల ఓ ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా .. ఈ ప్రచారం సరికాదని కొట్టి పారేసారు. కల్కి (ప్రాజెక్ట్ కే)తో మా సినిమాని పోల్చకూడదని అన్నారు. ``రాజా సాబ్ మాస్ ని మెప్పించే కమర్షియల్ సినిమా అని, రెగ్యులర్ సినిమా అని అనుకున్నారు.. కానీ ప్రాజెక్ట్ కే కంటే కూడా భారీ వీ.ఎఫ్.ఎక్స్ ఉంటుందని విన్నాము.. ఇది నిజమేనా? అని హోస్ట్ నిర్మాతను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ...``కానే కాదు.. దాంతో పోల్చకూడదు...కానీ విజువల్ వండర్ ఫిలిం`` అని అన్నారు. ఇది మొదట అనుకున్న కథేనా? కాదా? అని మళ్లీ ప్రశ్నించగా, ``మొదట అనుకున్న కథ అని నేనెప్పుడూ చెప్పలేదు`` అని అన్నారు. ప్రాజెక్ట్ కె విడుదలయ్యాకే దీని గురించి మాట్లాడతామని నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు.
రాజా సాబ్ ఫస్ట్ లుక్ విడుదలవ్వగానే ప్రభాస్ చాలా యంగ్ గా కనిపించారు... ఆ లుక్ ని ఏఐలో క్రియేట్ చేసారా? అని హోస్ట్ ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని అన్నారు. ప్రభాస్ పై 2022 నవంబర్ లో ఫోటోషూట్ జరిగింది.. కానీ ఇది ఆన్ సెట్స్ లుక్ అని విశ్వప్రసాద్ జవాబిచ్చారు. రాజా సాబ్ చాలా యంగ్ గా ఉన్నారు..ఇది అమేజింగ్ షాట్.. ఆల్రేడీ మా దగ్గర ఉన్న కంటెంట్ అద్భుతమైనదని కూడా అతడు తెలిపారు. రాజా సాబ్ 40శాతం పైగా చిత్రీకరణ పూర్తయిందని అన్నారు.