73లో ఈ స్పీడేంటీ తలైవా
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత రజినీకాంత్ కి ఈ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చింది. తెలుగులో కూడా ‘జైలర్’ భారీ కలెక్షన్స్ ని అందుకుంది. ప్రస్తుతం రజినీకాంత్ టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో ‘వేట్టయన్’ మూవీ కంప్లీట్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
మంచి ఎనర్జిటిక్ గా ఉందనే మాట తలైవా అభిమానుల నుంచి వినిపిస్తోంది. కచ్చితంగా టీజే జ్ఞాన్ వేల్ రజినీకాంత్ కి సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే రజినీకాంత్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేసారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని లోకేష్ రిలీజ్ చేశారు.
దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రంలో కూడా రజినీకాంత్ మాయ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. 2025 సమ్మర్ లో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే మరల నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్ పార్ట్ 2’ సినిమాకి రజినీకాంత్ ఒకే చెప్పేశారంట. ఈ ఏడాదిలోనే ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే 2025 అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. మొదటి సినిమా కంటే మరింత పవర్ ఫుల్ గా ‘జైలర్ 2’ కథని నెల్సన్ దిలీప్ సిద్ధం చేసారంట.
ప్రస్తుతం రజినీకాంత్ వయస్సు 73 ఏళ్ళు. ఈ వయస్సులో చాలా మంది యాక్టర్స్ సినిమాల పరంగా స్లో అయిపోయారు. రజినీకాంత్ సహ యాక్టర్స్ చాలా మంది హీరోలుగా రిటైర్మెంట్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా మారిపోయారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఈ వయస్సులో కూడా అంతే ఉత్సాహంతో, అంతకుమించి ఎనర్జీతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు.
వయస్సు పెరిగిన కూడా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ కి గట్టి పోటీ ఇస్తూ కమర్షియల్ హీరోగా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ద్వారానే కోలీవుడ్ కి ఫస్ట్ 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. లోకేష్ ‘కూలీ’, నెల్సన్ దిలీప్ ‘జైలర్ 2’ సినిమాలలో ఒకటి కచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.