ఆ నవ్వు సూపర్‌ స్టార్‌ ఐడియా...!

సాధారణంగా సినిమా షూటింగ్ ప్రారంభంకు ముందే సీన్ టు సీన్‌, షాట్ టు షాట్ అన్నట్లుగా స్క్రిప్ట్‌ ను రెడీ చేసుకుంటారు.

Update: 2024-08-17 07:12 GMT

సాధారణంగా సినిమా షూటింగ్ ప్రారంభంకు ముందే సీన్ టు సీన్‌, షాట్ టు షాట్ అన్నట్లుగా స్క్రిప్ట్‌ ను రెడీ చేసుకుంటారు. ఎక్కువ మంది దర్శకులు స్క్రిప్ట్‌ లో ఏదైతే అనుకుంటారో దాన్నే తుది ఔట్ పుట్‌ గా తీసుకు వస్తారు. కొందరు మాత్రం సందర్భానుసారంగా సన్నివేశాలను, షాట్స్ ను మార్చుతూ ఉంటారు, కొందరు ఏకంగా సీన్ లకు సీన్‌ లు మార్చుతూ, స్క్రిప్ట్‌ లో ఉన్నది ఒకటి అయితే తీసేది మరోటి ఉంటుంది. షూటింగ్ సమయంలో హీరోలు మొదలుకుని నిర్మాతలు, సహాయ దర్శకుల వరకు ఎన్నో రకాల సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అవి దర్శకుడికి నచ్చితే ఇంప్లిమెంట్‌ చేస్తారు.

స్క్రిప్ట్‌ లో లేని సన్నివేశాలు సినిమాలో పెట్టినప్పుడు అట్టర్ ఫ్లాప్ అవ్వడం లేదంటే మంచి స్పందన రావడం జరుగుతూ ఉంటుంది. సినిమా ప్రమోషన్ సమయంలో లేదంటే ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో అలాంటి విషయాల గురించి చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ ఉంటారు. తాజాగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమా లోని ఒక సన్నివేశం గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. దర్శకుడు నెల్సన్‌ ముందుగా రాసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం రజినీకాంత్ తన కుమారుడు నిజ స్వరూపం చేసి షాక్ అవుతాడు, ఆ తర్వాత మరో సీన్‌ ఉంటుంది.

సినిమాలో మాత్రం స్క్రిప్ట్‌ లో మాదిరిగా కాకుండా టీవీలో కొడుకు విషయాన్ని తెలుసుకున్న రజినీకాంత్‌ హార్ట్‌ బ్రేకింగ్‌ సన్నివేశాలు చూపించారు. అక్కడ హార్ట్‌ బ్రేక్ లాఫ్ ను ఆ సన్నివేశంలో పెట్టడం ద్వారా సినిమాకు మరింతగా ఎమోషన్‌ ను జత చేసినట్లు అయ్యింది. ఆ హార్ట్‌ బ్రేక్ లాఫ్‌ ఐడియాను స్వయంగా రజినీకాంత్‌ ఇచ్చాడట. దర్శకుడికి ఆ ఐడియా చెప్పిన వెంటనే నచ్చిందట. అప్పుడే వెంటనే షూట్‌ కూడా చేయడం జరిగిందట. ఆ సన్నివేశంలో రజినీకాంత్‌ నటన సూపర్‌ అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో వీడియోను తెగ షేర్‌ చేయడం జరిగింది.

రజినీకాంత్‌ నటనతో జైలర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం తెల్సిందే. కొడుకు నిజస్వరూపం తెలిసిన ఒక తండ్రి పడే మానసిక వేదన ను అద్భుతంగా చూపించడంలో దర్శకుడు నెల్సన్‌ హిట్ అయ్యాడు, అలాంటి ఎమోషన్స్ ను చూపించడంలో రజినీకాంత్ కూడా సూపర్‌ హిట్ అయ్యారు అనడంలో సందేహం లేదు. జైలర్ సినిమా రజినీకాంత్‌ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడమే కాకుండా ఆయన్ను తిరిగి ఫామ్‌ లోకి తీసుకు వచ్చిన ఘనత దక్కించుకుంది. సినిమా మేకింగ్ విషయంలో రజినీకాంత్‌ సలహాలను ఎంతో మంది యంగ్ డైరెక్టర్ తీసుకుని ఇలాంటి మంచి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు.

Tags:    

Similar News