.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి.. సూపర్ స్టార్ కూడా రివ్యూ ఇచ్చేశాడు

ఓ గొప్ప చిత్రాన్ని చూసిన ఫీలింగ్ కలిగిందని సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని డిఫరెంట్ లెవల్ కి తీసుకొని వెళ్లాడని రజినీకాంత్ ట్వీట్ లో రాసుకొచ్చారు.

Update: 2024-06-29 09:11 GMT

కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా మెజారిటీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భైరవ పాత్రలో మోడ్రన్ సూపర్ హీరోగా కనిపించాడు. ఇక అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపం చూపించారు.

ఇదిలా ఉంటే ఈ మూవీని చూసిన సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ ఆశ్విన్ క్రియేటివ్ ఇమాజినేషన్ గొప్పగా ఉందని పొగుడుతున్నారు. అలాగే మైథాలజీని సైన్స్ ఫిక్షన్ కి జోడించి మూవీ కథ చెప్పడం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లే స్థాయిలో కల్కి మూవీ అవుట్ ఫుట్ ఉందనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ రాజమౌళి కల్కి మూవీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమా అవుట్ ఫుట్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. అలాగే నాగ్ అశ్విన్ కూడా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకొని వెళ్లాడనే మాట వినిపిస్తోంది. అలాగే ఇలాంటి గొప్ప సినిమాని అందించిన వైజయంతీ మూవీస్ అశ్వినీ దత్ కి థాంక్స్ చెబుతున్నారు.

Read more!

ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కల్కి చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఓ గొప్ప చిత్రాన్ని చూసిన ఫీలింగ్ కలిగిందని సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని డిఫరెంట్ లెవల్ కి తీసుకొని వెళ్లాడని రజినీకాంత్ ట్వీట్ లో రాసుకొచ్చారు. అలాగే ఇలాంటి వరల్డ్ క్లాస్ సినిమాలో నటించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే నిర్మాత అశ్వినీదత్ కి సూపర్ స్టార్ కంగ్రాట్స్ చెప్పారు.

ఈ సినిమా పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రజినీకాంత్ తెలిపారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలపై చిత్ర యూనిట్ కూడా రియాక్ట్ అయ్యి ధన్యవాదాలు తెలియజేశారు. కల్కి 2898ఏడీ మూవీతో పార్ట్ 2 మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సీక్వెల్ పార్ట్ ని 3 ఏళ్ళ తర్వాత తీసుకొస్తానని నాగ్ అశ్విన్ చెప్పారు. మరి ఫ్యాన్స్, ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఈ సినిమాని తీసుకొచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి.

Tags:    

Similar News