'బాబా' తర్వాత దాన్ని వదిలేశా...!

తాజాగా లాల్ సలామ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ సినిమాపై నమ్మకం వ్యక్తం చేశాడు.

Update: 2024-02-06 04:53 GMT

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య పాత్రలో నటించిన లాల్ సలామ్‌ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడు తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో రూపొందిన ఈ సినిమాకు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది.

తాజాగా లాల్ సలామ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ సినిమాపై నమ్మకం వ్యక్తం చేశాడు. పలువురు ఈ సినిమాను మీరు ఎందుకు నిర్మించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు రజనీకాంత్‌ స్పందిస్తూ కథ రెడీ అయిన సమయంలో నేను పలువురు నిర్మాతల పేర్లను ఐశ్వర్య కి సూచించాను.

ఈ సినిమాను నేను ఎందుకు నిర్మించలేదని కొంత మంది అనుకుంటున్నారు. బాబా సినిమా తర్వాత నిర్మాణంను వదిలేశాను. మరోసారి నిర్మాణంపై ఆసక్తి చూపించొద్దు అనుకున్నాను. అందుకే ఎంత మంచి స్క్రిప్ట్‌ అయినా, కూతురు సినిమా అయినా కూడా నిర్మాతగా చేసేందుకు ఆసక్తి కనబర్చను అన్నట్లుగా సూపర్‌ స్టార్ చెప్పుకొచ్చాడు.

లాల్ సలామ్ సినిమా తో పాటు రజినీకాంత్‌ మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. జైలర్ సూపర్‌ హిట్ తర్వాత రజినీకాంత్‌ స్పీడ్ పెంచాడు. లాల్ సలామ్ సినిమా లో హీరో పాత్ర కాకపోయినా కూడా రజనీకాంత్‌ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐశ్వర్య ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామా గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.


Tags:    

Similar News