తొలిసారి రజనీకాంత్ లక్ష పారితోషకం అందుకున్న ఆ మూవీ ఏదో తెలుసా?

తాజాగా ఆయన నటించిన జైలర్ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తలకిందులు చేసింది.

Update: 2024-08-25 23:30 GMT

సౌత్ సినీ ఇండస్ట్రీ‌లో హీరో అంటే మంచి ఫిజిక్ ఉండాలి అనే అభిప్రాయాన్ని మార్చిన నటుడు రజినీకాంత్. పెద్దగా పర్సనాలిటీ లేకపోయినా తన స్టైల్‌తో సూపర్ స్టార్‌గా ఎదగడమే కాకుండా ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న విలక్షణమైన నటుడు రజనీకాంత్. గత 45 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఈరోజుకి కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పుతున్నాడు. తాజాగా ఆయన నటించిన జైలర్ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తలకిందులు చేసింది.

జైలర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలు వసూలు చేసి గత సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ కోసం రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం సుమారు 200 కోట్లు . దీంతో ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నా నటుడిగా రజని రికార్డు సృష్టించారు. ఈ మూవీ సక్సెస్ తర్వాత రజనీ చేస్తున్న నెక్స్ట్ మూవీ కూలీ. ఇక ఈ మూవీ కోసం రజనీకాంత్ కు ఏకంగా 280 కోట్ల రూపాయల రెంబినరేషన్ ఇవ్వడానికి నిర్మాత సిద్ధపడ్డారట.

కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ స్టార్ హీరో తన ప్రారంభ దశలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. రజని ఒకప్పుడు చాలా సినిమాల్లో విలన్ పాత్ర కూడా పోషించారు. ఆయన నటించిన 16 ఏళ్ల

వయసులో మూవీ కోసం రజనీ కేవలం 3000 రూపాయల పారితోషకం పుచ్చుకున్నారు. అప్పట్లో రజినీకి తన మార్కెట్ వాల్యూ ఎంత, పారితోషకం ఎంత అందుకోవాలి అన్న అవగాహన కూడా ఉండేది కాదట.

1975లో విడుదలైన భైరవి అనే చిత్రంలో రజనీకాంత్ మొదటిసారి ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ అప్పట్లో రజినీకాంత్ కెరీర్ లో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక ఈ మూవీ కోసం ఆయన అందుకున్న పారితోషకం 50వేల రూపాయలు. ఆ తర్వాత రజనీకాంత్‌కు పంచు అరుణాచలం నిర్మాణ సారధ్యంలో, ఎస్ బి ముత్తురామన్ దర్శకత్వం తెరకెక్కుతున్న ప్రియ మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ పారితోషకం కోసం రజనీని కలిసినప్పుడు..’మీ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరుగుతుంది అంటున్నారు కదా.. ప్రస్తుతం నేను సినిమాకి 35000 చొప్పున తీసుకుంటున్నాను.. మీరు ఒక 15000 ఇవ్వండి సరిపోతుంది’అని అన్నారట.

రజనీ మాటలు నచ్చిన పంచు అరుణాచలం..’మీకు మీ మార్కెట్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మీ సినిమాలు తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం మీ మార్కెట్ వాల్యూను బట్టి మీరు లక్ష రూపాయలు తీసుకున్న తక్కువే’ అని చెప్పి రజినీ చేతిలో 1,10,000 రెమ్యూనరేషన్ పెట్టారట. అలా రజినీ కెరీర్లో లక్ష రెమ్యూనరేషన్ తీసుకున్న చిత్రంగా ప్రియా మిగిలిపోయింది.

Tags:    

Similar News