వామ్మో.. రెమ్యునేషన్ లెక్క 200 కోట్లా?
రజినీకాంత్, విజయ్ ఏకంగా 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారంట. నిర్మాతలు కూడా వారు అడిగేంత ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ లో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్నారు. రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తితో తమిళ దర్శకులు కూడా వందల కోట్ల రూపాయిల బడ్జెట్ తో మూవీస్ చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ సమయంలో సినిమాలు కంప్లీట్ చేసేస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయిన ఆరు నెలలకి మించి సమయం తీసుకోవడం లేదు. ఈ కారణంగా నిర్మాతలకి ప్రొడక్షన్ ఖర్చు భాగా తగ్గుతుంది.
అదే సమయంలో కోలీవుడ్ సినిమాలు ఇప్పటి వరకు వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేయకపోయిన నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకి ఏకంగా 350 కోట్ల వరకు నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ లో టాప్ 2 స్టార్స్ గా ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్ సినిమాలకి అద్భుతమైన బిజినెస్ జరుగుతోంది.
వీరి సినిమాలకి 450 కోట్ల వరకు కలెక్షన్స్ నాన్ థీయాట్రికల్ రైట్స్ రూపంలోనే వస్తున్నాయి. తమిళనాట శాటిలైట్ బిజినెస్ కూడా బాగుండటంతో టీవీ ఛానల్స్ ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నాయి. అలాగే ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా భారీ మొత్తం నిర్మాతలకి వస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టార్ హీరోల రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.
రజినీకాంత్, విజయ్ ఏకంగా 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారంట. నిర్మాతలు కూడా వారు అడిగేంత ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. వారి సినిమాలపై బిజినెస్ ఎక్కువగా జరుగుతూ ఉండటమే దీనికి కారణం. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా ఓవరాల్ గా 500 కోట్లు కలెక్షన్స్ ని థియేటర్స్ లో క్రాస్ చేసింది.
నాన్ థీయాట్రికల్ రైట్స్ రైట్స్ ద్వారా కూడా 250 కోట్లకి పైనే నిర్మాతకి వచ్చింది. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడిలో 60 శాతం నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేశాయి. ఎవరేజ్ మూవీపైన కూడా నిర్మాతకి భారీ లాభాలు వచ్చినట్లు కోలీవుడ్ నాట వినిపిస్తోంది. అందుకే వారు డిమాండ్ చేస్తోన్న రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోతున్నారు అని టాక్.