ఒక్క రిప్లై.. రవితేజ హీరోయిన్ లవ్ స్టోరీ లీక్
తమిళం, మలయాళం ఇండస్ట్రీల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రజిషా విజయన్.
తమిళం, మలయాళం ఇండస్ట్రీల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రజిషా విజయన్. మాస్ మహారాజా రవితేజకు జోడీగా రామరావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
ఇది పక్కన పెడితే.. ఇప్పుడు రజిషా విజయన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమె కొన్నాళ్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా.. ఇటీవలే టోబిన్ థామస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వారు ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది.
టోబిన్ థామస్.. ఇన్ స్టాలో రజిషా విజయన్ తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ "1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం, ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం" అంటూ రాసుకొచ్చారు. ఇక టోబిన్ పోస్టుకు రజిష.. 1461 = 30 x ? + 1 x ? 1 x ? 2 x ?.. నిన్ను చూడడం కోసమే అంటూ రిప్లై ఇచ్చింది.
దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం ఇప్పుడు అఫీషియల్ గా బయటకు తెలిసింది. టోబిన్ ఇన్ స్టాలో రజిషా విజయన్‌తో కలిసి దిగిన ఫొటోస్ చాలా ఉన్నాయి. వీరిద్దరికి ఇప్పుడు నెటిజన్లు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. అప్పుడప్పుడు మనం చేసే పనుల వల్ల ఎవరికీ తెలియని విషయాలు బయటపడుతుంటాయని, రజిష విషయంలో అదే జరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
రజిషా విజయన్, టోబిన్ థామస్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన చిత్రం ఖోఖో. 2021లో విడుదలైన ఈ సినిమాకు రాహుల్ రంజిత్ దర్శకత్వం వహించారు. క్రీడా పోటీల నేపథ్యంలో సాగే ఖోఖో చిత్రంలో రజిష తన నటనతో ఆకట్టుకుంది. ఆమె నటించిన లవ్లీ యువర్స్ వేద చిత్రానికి టోబిన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మొత్తానికి చాలా కాలంగా సీక్రెట్ గా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి.