'శిల్పా కా పతి' అంటూ పరువు తీస్తున్నాడు!
పబ్లిక్ లో మాస్క్ తో తిరుగుతూ అల్లరి చేస్తున్నాడు. తాజాగా రాజ్ కుంద్రా పబ్లిక్ షో ఒకటి విస్తుపోయేలా చేసింది.
అశ్లీల వీడియోల యాప్‌లతో సినీనిర్మాత కం బిజినెస్‌మేన్ రాజ్ కుంద్రా వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారని ఆరోపణలొచ్చాయి. పలువురు టాప్ మోడల్స్, హీరోయిన్లతో నీలి చిత్రాల్ని చిత్రీకరించారని వాటిని యాప్ లలో షేర్ చేసి ధనార్జన చేసాడన్న ఆరోపణలతో ఇంతకుముందు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు.
ఇక జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రాజ్ కుంద్రా పబ్లిక్ అప్పియరెన్సులు విచిత్రంగా మారాయి. అతడు పబ్లిక్ లోకి రావాలంటే బ్లాక్ మాస్క్ ధరిస్తున్నాడు. దీంతో అతడిని మాస్క్ మ్యాన్ అంటూ జనం పిలుస్తున్నారు. ఇటీవల రాజ్ కుంద్రా స్టాండ్-అప్ కమెడియన్‌గా మారాడు. పబ్లిక్ లో మాస్క్ తో తిరుగుతూ అల్లరి చేస్తున్నాడు. తాజాగా రాజ్ కుంద్రా పబ్లిక్ షో ఒకటి విస్తుపోయేలా చేసింది. తనని తాను కాన్యే వెస్ట్ అంటూ ప్రముఖ హాలీవుడ్ స్టార్ తో పోల్చుకున్నాడు. నిజానికి అతడు అశ్లీల యాప్‌లతో దొరికిపోయినా కానీ దాని తాలూకా పశ్చాత్తాపం కించిత్ కూడా కనిపించలేదు. పైగా పబ్లిక్ ఈవెంట్లలో నేనే రాజ్‌కుంద్రా అని గర్వంగా చెప్పుకుంటున్నాడు.. కానీ పబ్లిక్ లో ఎప్పుడూ మాస్క్ తీయడం లేదు..మాస్క్ మేన్ తనని తాను హాలీవుడ్ స్టార్ తో పోల్చుకోవడం.. శిల్పా కా పతి అంటూ వ్యాఖ్యానించడం వంటివి పలువురు నెటిజనులను ఇర్రిటేట్ చేసాయి. దొంగ ఎప్పుడూ దర్జాగా ఉండటమెలానో ఈయన్ని చూసి నేర్వాలి.. అంటూ అంతా కామెంట్ చేస్తున్నారు.
మాస్క్ వేషాలు ఆపేదెప్పుడు?
అశ్లీల వీడియోల యాప్ కేసులో ప్రధాన నిందితుడిగా రాజ్ కుంద్రాపై ఆరోపణలున్నాయి. కానీ అతడు ప్రత్యేకంగా రూపొందించిన ఫేస్ మాస్కులు ధరించి బహిరంగంగా కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న గణపతి ఉత్సవాల్లో కూడా రాజ్ కుంద్రా ముసుగుతో కనిపించాడు. తాజా స్టాండ్-అప్ ఈవెంట్లో మళ్లీ ముసుగు ధరించి ప్రదర్శన ఇచ్చాడు. ఇన్ స్టా వీడియోలో అతడు తనను తాను 'సస్తా కాన్యే వెస్ట్', 'శిల్పా కా పతి' అని పరిచయం చేసుకోవడం విస్మయపరిచింది. అయితే అతడు తనని తాను హాలీవుడ్ స్టార్ కాన్యేతో పోల్చుకోవడం, శిల్పా కా పతి అని వ్యాఖ్యానించడం నెటిజనులకు నచ్చడం లేదు. అతడు శిల్పా పరువు తీస్తున్నాడని కొందరు భావిస్తున్నారు.
అంతేకాదు.. సెక్స్ పై జోక్‌లతో ఎవరికైనా సమస్య ఉంటే 10 నిమిషాల పాటు వెళ్లిపోవాలని అతడు ప్రేక్షకులను కోరాడు. ప్రేక్షకులు ఎవరూ బయటకు వెళ్లకపోవడంతో అతడు ప్రేక్షకులను 'తార్కి' అని వ్యాఖ్యానించాడు. అనంతరం తన లైఫ్ జర్నీ గురించి మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించానని.. 21 ఏళ్లకే పాష్మీనా శాలువాల (వ్యాపారం) సామ్రాజ్యాన్ని నిర్మించానని చెప్పాడు. వీడియో చివరలో ''మేరా కామ్ హమేషా సే కప్డే చదనే కా థా, ఉతర్నే కా నహీ'' అని అన్నాడు. అలాగే 'ది బాయ్జ్' టైటిల్లోని ఇమాజిన్ డ్రాగన్స్ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవ్వడం విశేషం.
ప్రస్తుతం రాజ్ కుంద్రా జీవితం ఆధారంగా ఓ సినిమా కూడా తెరకెక్కుతోంది. ఇందులో ఆయన తొలిసారిగా నటించనున్నట్లు సమాచారం. అశ్లీల చిత్రాల కేసులో మొదటి నిందితుడు అయినప్పటి నుండి ఆర్థర్ రోడ్ జైలులో గడిపిన కాలం వరకు అతడి జీవితంపై ఈ సినిమా తెరకెక్కనుంది.