ఆ సినిమాకి అరుదైన రికార్డు..ఇది ఎవ‌రైనా ఊహించారా?

'భాషా' రేంజ్ లో సినిమా ఉంటుంద‌ని ఒక‌టే ప్ర‌చారం సాగింది. కానీ తొలి షోతోనే 'కాలా' స‌త్తా ఏంటో తేలిపోయింది. అయితే ఇప్పుడీ సినిమాకి అరుదైన గౌర‌వం ద‌క్కింది.

Update: 2024-06-20 13:10 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'కాలా' ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఏమాత్రం రుచించ‌లేదు. బిల్డ‌ప్ ఎక్కువ బిజినెస్ త‌క్క‌వు అన్న‌ట్లు ఆసినిమా ఫ‌లితం క‌నిపిస్తుంది. త‌మిళ్ లో కూడా యావ‌రేజ్ గానే ఆడింది. రిలీజ్ కి ముందు హ‌డావుడి మామూలుగా జ‌ర‌గ‌లేదు.

'భాషా' రేంజ్ లో సినిమా ఉంటుంద‌ని ఒక‌టే ప్ర‌చారం సాగింది. కానా తొలి షోతోనే 'కాలా' స‌త్తా ఏంటో తేలిపోయింది. అయితే ఇప్పుడీ సినిమాకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగ‌జైన్ లో 21వ శ‌తాబ్ధ‌పు అద్భుత‌మైన 25 చిత్రాల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ మ్యాగ‌జైన్ లో స్థానం సంపాదించిన తొలి భార‌తీయ సినిమా గా కాలా రికార్డు సృష్టించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాష‌ల సినిమాలు ఈ జాబితాలో స్థానం కోసం పోటీ ప‌డుతుంటాయి. వాటిలో కొన్నింటికి మాత్ర‌మే ఈ అరుదైన ఘ‌నత ద‌క్కుతుంది. అందులో భార‌త్ నుంచి అందులోనూ సౌత్ నుంచి త‌మిళ సినిమా ఎంపిక‌వ్వ‌డం విశేషం. 'ఓల్డ్ బోయ్,' 'గెట్ ఔట్', 'ఆర్టిఫిషియ‌ల్', 'ఇంటెర్ వ‌ర్ష‌న్' లాంటి చిత్రాలున్నాయి. 2000 సంవ‌త్స‌రం నుంచి 2024 మ‌ధ్య‌లో వ‌చ్చిన సినిమాల్లో అన్ని విభాగాల‌ను ప‌రిశీలించి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌లిగిన 25 చిత్రాల‌ను ఎంపిక చేసారు.

ఏడాదికి ఒక సినిమా చొప్పున తీసుకున్నామ‌ని క‌మిటీ తెలిపింది. ఒక్కో విమ‌ర్శ‌కుడు ఒక్కో సినిమాను ప్ర‌తిపాదించిన‌ట్లు చెప్పారు. 'కాలా' క‌థ విష‌యానికి వ‌స్తే ముంబై మురికివాడ ప్రాంతం- రియ‌ల్ ఎస్టేట్ టైకూన్ మ‌ధ్య జ‌రిగే స్టోరీ ఇది. క‌థ బ‌లంగా ఉన్నా అంతే బ‌లంగా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో త‌ప్పిదాలు దొర్లాయి.

Tags:    

Similar News