రాజ్ తరుణ్ రాజీ ప్రయత్నాలు
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత వ్యవహారం సామాజిక మాద్యమాల్లో, మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత వ్యవహారం సామాజిక మాద్యమాల్లో, మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి రాజ్ మీద పలు ఆరోపణలు చేయగా.. ప్రతిగా రాజ్ కూడా ఆమె మీద అనేక ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. ఇటీవలే తాను ఆత్మహత్యకు పాల్పడబోతున్నట్లు లావణ్య తన లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరకు మెసేజ్ పెట్టడం కలకలం రేపింది. దీని మీద చర్చ జరుగుతుండగా.. కొన్ని రోజుల నుంచి రాజ్ అయితే ఎక్కడా కనిపించడం లేదు. మీడియాకు కూడా అందుబాటులో లేడు. ఈ సమయంలోనే రాజ్ ఈ కేసులో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవహారాన్ని గుట్టుగా ముగించడానికి అతను తన వాళ్లతో లావణ్యకు రాయబారాలు పంపిస్తున్నాడట.
తనకుకొన్ని రోజుల నుంచి వేర్వేరు వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నట్లు లావణ్య తాజాగా వెల్లడించింది. రాజ్ సెటిల్మెంట్ కోసం పిలుస్తున్నాడని.. డబ్బులు ఇవ్వజూపుతున్నాడని.. అలాగే నెల నెలా మెయింటైనెన్స్ కూడా ఇస్తానని వీరి ద్వారా చెప్పిస్తున్నాడని లావణ్య ఓ మీడియా సంస్థతో చెప్పింది. ఇక ఈ కేసుకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. ఇక తన జోలికి రావొద్దని అతను కోరుతున్నట్లు లావణ్య వెల్లడించింది. ఐతే రాజ్ ఇంతకుముందు కూడా సెటిల్మెంట్ కోసం ప్రయత్నించినట్లు లావణ్య లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపాడు. ఐదుకోట్లు ఇస్తానని, కేసు వాపస్ తీసుకుని సెటిల్ చేసుకుందామని ప్రముఖవ్యక్తులతో ఫోన్ చేయించాడని.. మెసేజ్‌లు కూడా పెట్టాడని.. వాటికి సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు సమర్పించామని చెప్పాడు. కానీ రాజ్ రాయబారాల గురించి మీడియాకు లావణ్య చెప్పేస్తున్న నేపథ్యంలో రాజకీ ఏమాత్రం ఓకే అంటుందో చూడాలి మరి.