విచారణకి రావడం కుదరదన్న రాజ్ తరుణ్

అయితే ఈ నోటీసులకి రాజ్ తరుణ్ తన లాయర్ ద్వారా సమాధానం పంపించారు.

Update: 2024-07-18 11:15 GMT

హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో నార్సింగ్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, సాక్ష్యాల ఆధారంగా రాజ్ తరుణ్ తో పాటు మాల్వీ మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా మీద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై జులై 18న విచారణకి హాజరు కావాలని రాజ్ తరుణ్ కి నోటీసులు పంపించారు. అయితే ఈ నోటీసులకి రాజ్ తరుణ్ తన లాయర్ ద్వారా సమాధానం పంపించారు. విచారణకి ప్రస్తుతం హాజరుకాలేనని లాయర్ ద్వారా వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం తాను అందుబాటులో లేనని, ఈ కారణం వలన విచారణకి హాజరుకాలేకపోతున్నట్లు రాజ్ తరుణ్ తన లాయర్ ద్వారా నార్సింగ్ పోలీసులకి తెలియజేసారు. అయితే రాజ్ తరుణ్ వచ్చే వరకు ఈ కేసులో తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రాజ్ తరుణ్ కి పోలీసులు నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నారంట. ఆయన వివరణ పరిశీలించి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నోటీసులకి కూడా రాజ్ తరుణ్ స్పందించి విచారణకి రాకపోతే తదుపరి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. లావణ్య అయితే లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ద్వారా చట్టపరంగా రాజ్ తరుణ్ తో ఫైట్ చేయడానికి సిద్ధం అయ్యింది. తనని గుడిలో పెళ్లి చేసుకొని 11 ఏళ్ళు కాపురం చేసాడని లావణ్య ఆరోపిస్తోంది. తనకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. రెండు సార్లు గర్భం చేసి అబార్షన్ కూడా చేసాడని లావణ్య ఆధారాలు సమర్పించింది.

హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపైన కూడా కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆమె విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరో వైపు రాజ్ తరుణ్ ఇప్పటికే లావణ్యపై కేసు పెడతానని చెప్పారు. అయితే ఇప్పుడు పోలీసులు విచారణకి హాజరుకావాలని ఇచ్చిన నోటీసులకి కూడా రాజ్ తరుణ్ మీడియా ముందుకి రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది. ఎవరి వైపు తప్పు ఉంది తెలుసుకోవాలంటే క్యూరియాసిటీ పబ్లిక్ లో ఉంది.

ఈ ఇష్యూ టాలీవుడ్ లో ఆసక్తికర అంశంగా మారింది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కొత్త సినిమా పురుషోత్తముడు జులై 26న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అయిన రాజ్ తరుణ్ బయటకి రావాల్సి ఉంటుంది. అప్పుడైనా తన మీద వస్తోన్న ఆరోపణలకి, నమోదైన కేసుకి రాజ్ తరుణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News