ఇంటర్వ్యూ: జితేందర్ రెడ్డి.. ఒక థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా!

సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Update: 2024-11-07 11:01 GMT

'ఎవరికీ చెప్పొద్దు' ఫేమ్ రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం ''జితేందర్ రెడ్డి''. 'ఉయ్యాలా జంపాల', 'మజ్ను' లాంటి హిట్ మూవీస్ తీసిన విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ముదుగంటి రవీందర్ రెడ్డి దీనికి నిర్మాత. 1980లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం.. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో రాకేష్ వర్రే, డైరెక్టర్ విరించి వర్మ లేటెస్టుగా 'తుపాకీ డాట్ కామ్' తో ముచ్చటించారు. సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

'జితేందర్ రెడ్డి' అనేది ఒక థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా అని హీరో రాకేష్ చెప్పారు. అయితే ఇందులో రెగ్యులర్ సినిమాలో మాదిరిగా యాక్షన్ ఉండదని అంటున్నారు. ఇది జితేందర్ రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ అయినప్పటికీ, ఒక బయోపిక్ లా కాకుండా మంచి హీరోయిజం ఉన్న కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దామని తెలిపారు. ఒకప్పుడు సినిమా అంటే పెళ్లి భోజనంలా ఉండాలని, ఈరోజుల్లో బిర్యానీలా ఉన్నా జనాలు చూస్తున్నారని దర్శకుడు విరించి వర్మ అన్నారు. ఇది చాలా మంచి పొటెన్షియల్ ఉన్న కథ అని, ఈ జెనరేషన్ ఆడియన్స్ కి తప్పకుండా నచ్చుతుందని నమ్మకంగా చెప్పారు.

నిజ జీవిత పాత్రలతో సినిమా అంటే ఏవైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉందని తన ఫ్రెండ్స్ ముందుగా హెచ్చరించారని, అయినా సరే తాను అవేవీ పట్టించుకోలేదని విరించి వర్మ అన్నారు. జెన్యూన్ గా ఇలాంటి ఎమోషనల్ స్టోరీ చెప్పే అవకాశం వచ్చింది.. అనవసరంగా భయపడి గొప్ప కథను తెలియజెప్పే ఛాన్స్ మిస్ చేసుకోకూడదని అనుకున్నాని తెలిపారు. 'జితేందర్ రెడ్డి' దర్శక హీరోలు చెప్పిన మరిన్ని విశేషాల కోసం ఈ క్రింది ఇంటర్వూ చూడండి...

Full View
Tags:    

Similar News