తెరపైకి రోషన్ కుటుంబ జీవితం!
బాలీవుడ్ లో కూడా `మనం` తరహా ప్రయత్నం జరుగుతోందా? మూడు తరాల వారసులు కలిసి నటించబో తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది.
బాలీవుడ్ లో కూడా `మనం` తరహా ప్రయత్నం జరుగుతోందా? మూడు తరాల వారసులు కలిసి నటించబో తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. అక్కినేని కుటుంబం చేసిన `మనం` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏఎన్నార్ చిరకాల కోరిక ఆ సినిమాతో నెరవేరింది. ఏఎన్నార్.. నాగార్జున.. నాగచైతన్య ఇలా మూడు తరాలు కలిసి నటించిన సినిమాని ప్రేక్షకులు హృదయాల్లో ఓ మధుర జ్ఞాపకంగా పదిలం చేసుకున్నారు. టాలీవుడ్ లో అప్పటివరకూ జరగని ఓ ప్రయత్నం అక్కినేని ఫ్యామిలీ చేసి అభిమానులకు ఓ గొప్ప అనుభూతిని పంచారు.
అయితే ఇప్పుడీ తరహా ప్రయత్నం రాకేష్ రోషన్ కుటుంబం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు తరాల నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న రోషన్ కుటుంబ వారసత్వం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రాబోతుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ ఇన్ స్టా వేదికగా రివీల్ చేసారు. గొప్ప సంగీత కళాకారుడైన తాత రోషన్ లాల్ నాగ్ రత్ 106వ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. హిందీ సినిమా రంగంలో రోషన్ లాల్ తో మొదలైన సినీ జీవితం తన కుమారులు రాకేష్ రోషన్..రాజేష్ రోషన్.మనవడు హృతిక్ రోషన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూడు తరాలకి సంబంధించిన కథనే డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురా బోతున్నారు. రాజేష్ రోషన్ కుమార్తె పశిమ రోషన్ కూడా ఈ డాక్యుమెంటరీలో నటిస్తుంది. `ఇష్క్ విష్క్-2` సినిమాతో పశిమ బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తోంది. ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేసే బాధ్యతలు శషి రంజన్ కి అప్పగించారు. సొంత నిర్మాణ సంస్థలోనే రోషన కుటుంబ సభ్యులు దీన్ని నిర్మిస్తున్నారు.
మొత్తానికి ఇది బాలీవుడ్ లో `మనం` తరహా ప్రయత్నం అని క్లియర్ గా తెలుస్తోంది. మనం సినిమాగా చేస్తే..రోషన్ కుటుంబ కథని ఓ డాక్యుమెంటరీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మరింత లోతుగా ఆ మూడు తరాల కథని చెప్పడానికి అవకాశం ఉంటుంది. రోషల్ లాల్ బాల్యం నుంచి హృతిక్ రోషన్ స్టార్ హీరోగా ఎదిగిన వైనం వరకూ ప్రతీ విషయాన్ని పిన్ టూ పిన్ చర్చించనున్నారని తెలుస్తోంది. ఇలా ఒకే తెరపై మూడు తరాలు కలిసి నటించాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటి నటులు పెట్టి పుట్టి ఉండాలి. టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ..బాలీవుడ్ లో రోషన్ ఫ్యామిలీ ఆ రకంగా సినీ పరిశ్రమలో ఓ చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు.