ఆక్యూటీలో ఇప్పుడెన్నో మార్పులే!

త్రోబ్యాక్ ఫోట‌ల‌తో.. .చిన్న‌నాటి ఫోటోల‌తో విష‌యాన్ని చెప్ప‌డం ఎంతో ఇంట్రెస్టింగ్ గా భావిస్తున్నారు.

Update: 2024-10-10 13:30 GMT

త్రో బ్యాక్ ఫోటోలు..చిన్న నాటి ఫోటోలు షేర్ చేయ‌డం ఇప్పుడు ట్రెండ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. సెల‌బ్రిటీలకు సంబంధించిన అలాంటి ఫోటోలు లీకైతే అభిమానులు వాటిని అంతే ఆస్వాది స్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న‌ట్లు పాత ఫోట‌ల‌కు ఇప్పుడు మంచి గిరాకీ క‌నిపిస్తుంది. త్రోబ్యాక్ ఫోట‌ల‌తో.. .చిన్న‌నాటి ఫోటోల‌తో విష‌యాన్ని చెప్ప‌డం ఎంతో ఇంట్రెస్టింగ్ గా భావిస్తున్నారు.


చిన‌ప్పుడు ఎలా ఉన్నారు? పెద్ద అయిన‌ప్పుడు వ‌చ్చిన మార్పుల్ని గ‌మ‌నించి చెప్ప‌డం నెట జ‌నులు ఆస‌క్తిక‌రంగా భావిస్తున్నారు. కొన్ని గంట‌ల క్రిత‌మే కంగ‌నా ఆరేడేళ్ల వ‌య‌సుగ‌ల ఫోటోలు షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో కంగ‌న‌ని చూస్తే ఇప్ప‌టి కంగ‌న‌ని చూసిన‌ట్లే ఉంది. ఆమె రూప లావ‌ణ్యంలో ఎలాంటి మార్పులు లేవు. వ‌య‌సు పెరిగింద‌నే మార్పు త‌ప్పా ఇంకే పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజును పుర‌స్కరించుకుని ఆమె బాల్యం నాటి ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. ర‌కుల్ చిన్న‌ప్పుడు బొద్దుగానే ఉంది. చెవులు, క‌ళ్లు పెద్ద‌విగా ఉన్నాయి. ముక్కు.. పెదాలు సైతం కెరీర్ ఆరంభంలో ర‌కుల్ ఎలా ఉండేదో? అప్పుడు అలాగే ఉన్నాయి. స్టార్ అయిన ఆ త‌ర్వాత ర‌కుల్ ముక్కు..పెదాల‌కు స‌ర్జ‌రీ చేయించింది. దీంతో కొన్ని మార్పులొచ్చాయి.

ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ర‌కుల్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఎవ‌రీ క్యూటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ర‌కుల్ ప్రోఫెష‌న‌ల్ కెరీర్ గురించి చెప్పేదేముంది. బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంది. ఇటీవ‌లే `అయలాన్` తో ఓ హిట్ ఖాతాలో వేసుకుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఇండియ‌న్ -2 మాత్రం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అలాగే వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం భ‌ర్త జాకీ భ‌గ్నానీ ఆర్దిక క‌ష్టాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌గా వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఆయ‌న న‌ష్టాల్లో ఉన్నారు.

Tags:    

Similar News