రకుల్‌కి ఇప్పట్లో హనీమూన్ ఆలోచనే లేదు
సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే
సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొత్త కోడలు తమ ఇంట అడుగుపెట్టగానే లక్ష్మీ కళ వచ్చిందంటూ భగ్నానీల కుటుంబం మురిసిపోతోంది. రకుల్-భగ్నానీ పెళ్లికి సంబంధించిన చాలా ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తరుణ్ తహిలియాని లెహంగాలో అత్యంత అందమైన వధువుగా మారిన రకుల్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
రకుల్ తాజాగా మరోసారి తన భర్త జాకీ భగ్నానితో కలిసి పోజులిచ్చింది. రంగురంగుల డిజైన్ లు.. తెల్లటి పూల ప్లేసూట్ను ఎంపిక చేసుకుంది రకుల్. జాకీ భగ్నానీ తన భార్య చెంతనే బ్యాగీ ట్రాపికల్ ప్రింటెడ్ షర్ట్ - షార్ట్స్ లో కనిపించాడు. ఇద్దరూ ఫ్లోరల్ డ్రెస్ లో స్పెషల్ గా కనిపిస్తున్నారు.
అయితే ఈ జంట హనీమూన్ కి వెళ్లేదెపుడు? అంటే దీనికి ఇంకా తొందర లేదనే అభిప్రాయంలో ఉందిట రకుల్ ప్రీత్. ఇప్పుడే హనీమూన్ కి వెళ్లాలనే మూడ్ లో లేదని కూడా తెలిసింది. నిజానికి రకుల్ .. జాకీ ఇద్దరూ ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. వారు తమ కమిట్ మెంట్లు పూర్తయాక తీరిగ్గా హనీమూన్ ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు చాలామంది స్టార్లకు ఇదే సన్నివేశం కనిపించింది. దీపిక పదుకొనే, అనుష్క శర్మ సహా చాలా మంది కథానాయికలు పెళ్లయాక కొంత సమయం తీసుకునే హనీమూన్ ని ఆస్వాధించారు.
రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ బుధవారం గోవాలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు PM నరేంద్ర మోడీ స్పెషల్ నోట్లో కొత్త జంటను ఆశీర్వదించారు. తనను పెళ్లి వేడుకకు ఆహ్వానించబడినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. కొత్త జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఐటిసి గ్రాండ్ సౌత్ గోవాలో ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి కోసం రకుల్ అపారమైన వజ్రాలు ఉన్న పింక్-పీచ్ లెహంగా ధరించింది. జాకీ ఒక భారీ నెక్లెస్‌తో కూడిన క్రీమ్-గోల్డెన్ షేర్వానీని ధరించాడు.