ప్రపోజ్ చేయమని బలవంత పెట్టిన నటి!
అవును.. నిజమే..! ప్రముఖ నిర్మాతను పాపులర్ నటి ప్రపోజ్ చేయాల్సిందిగా బలవంత పెట్టిందట. తాను తొలిగా అతడికి ప్రపోజ్ చేసింది
అవును.. నిజమే..! ప్రముఖ నిర్మాతను పాపులర్ నటి ప్రపోజ్ చేయాల్సిందిగా బలవంత పెట్టిందట. తాను తొలిగా అతడికి ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత అతడు మోకాళ్లపై నిలిచి తనకు ప్రపోజ్ చేస్తాడని వేచి చూసిందట. కానీ అతడు అలా చేయలేదు. దాంతో తన కోరికను అతడికి వెలిబుచ్చింది. ఆ తర్వాత గోవాలో పెళ్లికి ముందు తాను కోరుకున్న కోరికను తీర్చాడు అతడు. ఈ ఎపిసోడ్ లో నటి ఎవరు? అతడు ఎవరు? అంటే..వివరాల్లోకి వెళ్లాలి.
ప్రముఖ నిర్మాత కం నటుడు జాకీ భగ్నానీతో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్, ప్రేమ పెళ్లి గురించి తెలిసిందే. ఇటీవల గోవాలో ఈ జంట వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు జాకీ తనకు ప్రపోజ్ చేయలేదని, కానీ అతడిని ప్రపోజ్ చేయాల్సిందిగా బలవంతం చేసానని ఇటీవలి ఇంటర్వ్యూలో రకుల్ తెలిపింది.
పెళ్లి తేదీ ఫిక్స్ చేసుకుని, పెళ్లి పనులకు సంబంధించిన ప్లానింగ్ సాగుతున్నా కానీ జాకీ ఇంకా మోకాలిపైకి దిగి నాకు ప్రపోజ్ చేయలేదు. నాకు అలాంటి స్పెషల్ ప్రపోజల్ స్టోరీ కావాలనిపించిందని రకుల్ తెలిపారు. నేను ఇదే విషయాన్ని అతడితో చెప్పాను.. మీరు ప్రపోజ్ చేయాలి ... మీకు 2-3 నెలలు మిగిలి ఉన్నాయి. మీరు ఎలా చేసినా దాన్ని గుర్తుంచుకుంటామని రకుల్ అడిగిందట. చివరికి తన నిరీక్షణ ఫలించింది. గత డిసెంబర్లో తమ జాయింట్ బ్యాచిలర్స్ పార్టీ సందర్భంగా రకుల్‌ను జాకీ ఆశ్చర్యపరిచాడు. నటీమణులు ప్రగ్యా జైస్వాల్ - మంచు లక్ష్మి సహా దాదాపు 25 మంది సన్నిహితులు హాజరైన స్పెషల్ పార్టీ ఈ ప్రతిపాదనకు వేదికగా మారింది. నిజాయితీగా చెప్పాలంటే నేను నా ప్రతిపాదనను పూర్తిగా మర్చిపోయాను! అని రకుల్ తెలిపింది. అయితే అతను నన్ను ఆశ్చర్యపరిచాడు.. నాకు అలా జరుగుతుందని ముందే తెలియదు అని రకుల్ నాటి స్వీట్ మెమరీని గుర్తు చేసుకుంది.
21 ఫిబ్రవరి 2024న గోవాలో రకుల్ - జాకీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి వృత్తిలో బిజీ అయ్యారు. రకుల్ `మేరీ పత్నీ కా`.. `ఇండియన్ 2` చిత్రీకరణలో బిజీగా ఉంది. జాకీ నటనలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం `సూర్యపుత్ర మహావీర్ కర్ణ` , `మిషన్ లయన్` అనే రెండు చిత్రాలు అతడు చేస్తున్నాడు.