# RC17 లో రామ్ డ్యూయెల్ రోల్!

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ విష‌యం నెట్టింట వైర్ అవుతుంది. ఇది ప‌క్కా యాక్ష‌న్ ప్యాక్డ్ చిత్ర‌మ‌ని తెలిసింది.

Update: 2025-02-18 07:30 GMT

# ఆర్సీ 17 స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `రంగ‌స్థ‌లం` త‌ర్వాత‌ చ‌ర‌ణ్ -సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్ర‌మిది. దీంతో సుకుమార్ ఈసారి ఎలాంటి కంటెంట్ లో చ‌ర‌ణ్ చూపించ‌బోతున్నాడు? అన్న అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. స్టైలిష్ రామ్ చ‌ర‌ణ్ ని చూపిస్తు న్నాడా? లేక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రామ్ ని చూపిస్తున్నాడా? రంగ స్థ‌లం లాంటి మ‌ట్టి వాస‌న చెప్ప‌బోతున్నాడా? అని ఇలా ర‌క‌ర‌కాల సందేహాలు వెంటాడుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ విష‌యం నెట్టింట వైర్ అవుతుంది. ఇది ప‌క్కా యాక్ష‌న్ ప్యాక్డ్ చిత్ర‌మ‌ని తెలిసింది. సుకుమార్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుందంటున్నారు. సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ డిఫ‌రెంట్ జోనర్ నే మాస్ కోణంలో చెప్ప‌బోతున్నాడుట‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం పోషిస్తున్నాడుట‌. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి.

సుకుమార్ గ‌త చిత్రం `పుష్ప` డిఫ‌రెంట్ జాన‌ర్లో ఆక‌ట్టుకున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. అంత‌కు ముందు తెర‌కెక్కించిన `రంగ‌స్థ‌లం` విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఇంకా ముందుకు వెళ్తే ఎన్టీఆర్ తో `నాన్న‌కు ప్రేమ‌తో` అంటూ స్టైలిష్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సుకుమార్ నుంచి రిలీజ్ అయిన ల‌వ్ స్టోరీలు మిన‌హాయిస్తే అన్ని డిఫ‌రెంట్ జాన‌ర్లో ట్రై చేసిన చిత్రాలే. `రంగ‌స్థ‌లం`తోనే రామ్ చ‌ర‌ణ్ కి జాతీయ అవార్డు వ‌స్తుంద‌ని సుకుమార్ ఆశించారు.

కానీ అది జ‌ర‌గ‌లేదు. ఆ త‌ర్వాత బ‌న్నీతో చేసిన `పుష్ప‌`కు జాతీయ అవార్డు వ‌చ్చింది. `గేమ్ ఛేంజ‌ర్` తోనైనా రామ్ చ‌ర‌ణ్ కు జాతీయ అవార్డు వ‌స్తుంద‌ని సుకుమార్ న‌మ్మారు. కానీ అది ప‌న‌వ్వ‌లేదు. ఇలా ప్ర‌తీసారి రామ్ చ‌ర‌ణ్ కు జాతీయ అవార్డు అంటూ బాగా హైలైట్ చేసారు. ఈ నేప‌థ్యంలో ఆ బాధ్య‌త తానే తీసుకునే స్థాయిలో ఆర్సీ 17 సిద్దం చేస్తున్నాడేమో చూడాలి.

Tags:    

Similar News