RC16: బుచ్చి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే..
రామ్ చరణ్ తన తదుపరి చిత్రం RC16 కోసం హై వోల్టేజ్ ఎనర్జీతో రెడీ అవుతున్నారు.
రామ్ చరణ్ తన తదుపరి చిత్రం RC16 కోసం హై వోల్టేజ్ ఎనర్జీతో రెడీ అవుతున్నారు. RRR తరహా బిగ్ బడ్జెట్ మూవీ తర్వాత, ఆయన నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అయితే, ఆ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇప్పుడు అదే తరహాలో RC16 లోనూ ఒక బిగ్ ఎపిసోడ్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.
RC16 ను బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ లుక్, కథనం అన్నీ కొత్తగా ఉంటాయని సమాచారం. అయితే, ఈ సినిమాలోని మేజర్ హైలైట్ ఏమిటంటే గేమ్ ఛేంజర్ లోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లాగా, RC16 లోనూ బిగ్ మాస్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో కీ రోల్ పోషించనుందని, కథను మరింత ఎమోషనల్‌గా మలచనుందని చెబుతున్నారు. అలాగే ఇందులో రామ్ చరణ్ పాత్రకు స్పెషల్ డెప్త్ ఉండేలా దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేశారని సమాచారం. గేమ్ ఛేంజర్ లోని ఫ్లాష్‌బ్యాక్ కంటే ఎక్కువ మాస్, ఎమోషన్ మిక్స్ చేసి, ఈ సినిమాకు మరో లెవెల్ హైప్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
క్రికెట్, కుస్తీ నేపథ్యంగా నడిచే ఈ సినిమా కోసం చరణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన టీమ్, వచ్చే షెడ్యూల్‌లో ఈ బిగ్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనుంది. దీనికి సంబంధించి భారీ సెట్స్ రెడీ అవుతున్నాయని టాక్. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ విషయంలో ఏఆర్ రెహమాన్ బిగ్ ప్లస్ కానున్నారు. అంతేగాక, రామ్ చరణ్ కోసం కొన్ని ప్రత్యేకమైన మాస్ బీట్‌లను రెడీ చేస్తున్నట్లు సమాచారం. టెక్నికల్ టీమ్ కూడా సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు టాక్. మొత్తానికి, RC16 కోసం గేమ్ ఛేంజర్ తరహా మాస్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్లాన్ చేయడం, ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఇక ఇది ప్రేక్షకులను ఏ స్థాయిలో ఎంగేజ్ చేస్తుందో చూడాలి.