ఆరోగ్యం బాలేకపోయినా బిజీబిజీగా చరణ్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2025-02-08 11:56 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆ సినిమా.. సంక్రాంతికి విడుదలైంది. కానీ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ గా మారింది.

అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత సోలోగా గేమ్ ఛేంజర్ తో వచ్చిన రామ్ చరణ్.. అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోయారు. ఇప్పుడు RC 16 మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకు గాను సరైన ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది.

రీసెంట్ గా సినిమాటోగ్రాఫర్ నైట్ టైమ్ షూటింగ్ జరుగుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉందని తెలుస్తోంది. అయితే చరణ్ ఇప్పుడు 103 డిగ్రీల సెల్సియస్ జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ తన వల్ల షూటింగ్ కు బ్రేక్ పడకూడదని షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.

చరణ్ గత ఐదు రోజులు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. కానీ బ్రేక్ తీసుకోకుండా షూట్ ను పూర్తి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని మేకర్స్ సజ్జెస్ట్ చేసినా.. ఆయన అందుకు ఒప్పుకోలేదని వినికిడి. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డెడికేషన్ అంటే అలా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కేర్ తీసుకోండి అన్న అని సూచిస్తున్నారు. అయితే గత వారమంతా రాత్రిపూటే షూటింగ్ నిర్వహించారట దర్శకుడు బుచ్చిబాబు. ఇప్పుడు డే టైమ్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి మధ్య నాటికి ప్రస్తుత షెడ్యూల్ ముగుస్తుందని టాక్.

ఇక సినిమా విషయానికొస్తే.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. స్టార్ యాక్టర్లు జగపతి బాబు, శివ రాజ్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.

Tags:    

Similar News