వ‌ర్మ సంచ‌ల‌నంలో అస‌లు న‌టులు వీళ్లా?

బిగ్ బీ అమితాబ్చ‌న్ , అభిషేక్ బ‌చ్చ‌న్, కృష్ణ కుమార్ మీన‌న్, సుప్రియా పాఠ‌క్, క‌త్రినాకైఫ్, త‌నీషా ప్రధాన పాత్ర‌ల్లో రాంగోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన `స‌ర్కార్` అప్ప‌ట్లో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే.

Update: 2025-02-14 05:48 GMT

బిగ్ బీ అమితాబ్చ‌న్ , అభిషేక్ బ‌చ్చ‌న్, కృష్ణ కుమార్ మీన‌న్, సుప్రియా పాఠ‌క్, క‌త్రినాకైఫ్, త‌నీషా ప్రధాన పాత్ర‌ల్లో రాంగోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన `స‌ర్కార్` అప్ప‌ట్లో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. వ‌ర్మ మార్క్ క్రైమ్ థిల్ల‌ర్ గా రూపొందిన చిత్రం అప్ప‌ట్లోనే 40 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అమితాబ్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ చిత్రంగా మిగిలిపోయింది. ఇప్ప‌టికీ స‌ర్కార్ అంటే? భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఓ సంచల‌నంగానే అభిమానులు భావిస్తారు.

అయితే ఇదే `స‌ర్కార్` లో అస‌లు న‌టుడు అమితాబ‌చ్చ‌న్ కాదు? అన్న‌ది ఎంత మందికి తెలుసు. అవును. తొలుత ఈ ప్రాజెక్ట్ `నాయ‌క్` టైటిల్ తో న‌సీరుద్దిన్ షా, సంజ‌య్ ద‌త్ ల‌తో తెర‌కెక్కించాల‌నుకున్నారు. ఇందులో ఇద్ద‌రు తండ్రీ కొడుకుల పాత్రలుగా వ‌ర్మ మ‌లిచారు. అయితే 1993లో ముంబైలో పేలుళ్లు జ‌ర‌గ‌డం..అదే కేసులో సంజ‌య్ ద‌త్ జైలుకెళ్ల‌డంతో? ఆ ప్రాజెక్ట్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. దీంతో రాంగోపాల్ వ‌ర్మ అదే కాన్సెప్ట్ ను స‌ర్కారుగా మార్చడంతో? అందులోకి అభిషేక్ బ‌చ్చ‌న్, అమితాబ‌చ్చ‌న్ వ‌చ్చి చేరారు.

`స‌ర్కార్ `కి సీక్వెల్ గానే 2008 లో మ‌ళ్లీ `సర్కార్ రాజ్` ని వ‌ర్మ తెర‌కెక్కించారు. ఇందులోనూ అమితాబ్, అభిషేక్ లు న‌టించారు. వారితో పాటు ఐశ్వ‌ర్యారాయ్, సుప్రియా పాట‌క్, దిలీప్ ప్ర‌భావాక‌ర్ న‌టించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అప్ప‌ట్లోనే ఈ చిత్రం 90 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇదే కాంబినేష‌న్ లో వ‌ర్మ మ‌ళ్లీ సర్కార్ లాంటి కంటెంట్ తో నేటి జ‌న‌రేష‌న్ యువ‌త‌ని మెప్పించేలా అద్భుత‌మైన సినిమా చేయాల‌ని నెటి జ‌నులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆశిస్తున్నారు.

ఇటీవ‌లే వ‌ర్మ కూడా మ‌ళ్లీ పాత వ‌ర్మ‌ను చూస్తారని సంచ‌ల‌న స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో `స‌ర్కార్` , `రంగీలా`, ముంబై ఎటాక్స్ లాంటి సినిమాలు వ‌ర్మ నుంచి ఆశిస్తున్న వారెంతో మంది ఉన్నారు. అలాగే వ‌ర్మ ఇప్ప‌టికే కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌తో సినిమాలు చేస్తాన‌ని ప్ర‌కటించారు. వాటిని కూడా వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కించాలని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News