భారీ కాన్వాస్ పై 'సిండికేట్'...రంగంలోకి సర్కార్!
ఈ నేపథ్యంలో చిత్రాన్ని భారీ కాన్సాస్ పై తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా ప్రాజెక్ట్ లో టాప్ స్టార్లనే భాగం చేస్తున్నట్లు సమాచారం.
సంలచన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవలే 'సిండికేట్' ప్రాజెక్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 70వ దశకం భారత స్ట్రీట్ గ్యాంగ్ తో మొదుల పెట్టి ఐసీస్ వరకూ ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను చూసిందని , గత పదిహేనేళ్లగా చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్ లేవి ఏర్పడలేదని ఒకవేళ భవిష్యత్ లో కొత్త గ్యాంగ్ ఏర్పడితే సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటాయి? అన్నది 'సిండికేట్' లో చూపించబోతున్నట్లు ముందే చెప్పేసారు.
'ఓన్లీ మ్యాన్ కెన్ బీ ది మోస్ట్ టెర్రీ ఫైయింగ్ యానిమల్' అంటూ ఓ క్యాప్షన్ కూడా టైటిల్ కి ఇచ్చాడు. 'మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కావడం'. అంటే వర్మ ఇందులో భవిష్యత్ క్రైమ్ ని చూపించబో తున్నాడా? క్తైమ్ లో 'యానిమల్', మలయాళ చిత్రం 'మార్కో'ని మించిపోయేలా ఈ చిత్రం ఉంటుందనే సందేహాలు అప్పుడే మొదలైపోయాయి. అందులోనూ క్రైమ్ ని ఎంతో అడ్వాన్స్ డ్ గా చూపించబోతున్నాడనే బజ్ మొదలైంది.
వర్మ మనసు పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ అంతటి మనసు 'సిండికేట్' పై కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని భారీ కాన్సాస్ పై తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా ప్రాజెక్ట్ లో టాప్ స్టార్లనే భాగం చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ ఓ గెస్ట్ రోల్ కి సంప్రది స్తున్నారుట. ఆయనపై షూటింగ్ పది రోజుల పాటు ఉంటుందిట. అలాగే టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్ తో ఓ కీలక పాత్రకు చర్చలు జరుపుతున్నారుట.
వెంకీ పై షూటింగ్ 35 రోజుల పాటు ప్లాన్ చేస్తున్నారుట. అలాగే మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ తో కూడా ముఖ్యమైన పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారుట. ఇంకా బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్ పాయ్, అనురాగ్ కశ్యప్ సహా పలువురితో వర్మ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి మిడ్ నుంచి ప్లాన్ చేస్తున్నారుట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నుంచి ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించడానికి ముందుకొస్తుందిట.