గుంటూరు కారం ట్రోల్స్ ఎఫెక్ఫ్.. షాకింగ్ డిసిషన్

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలపై జరిగే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఈ ట్రోలింగ్స్ మరీ ఎక్కువైపోయాయి

Update: 2023-12-15 10:15 GMT

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలపై జరిగే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఈ ట్రోలింగ్స్ మరీ ఎక్కువైపోయాయి. కొంతమంది వీటిని భరించలేక తమ సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా డిలీట్ చేసే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా ఇదే చేశారు. మ్యాటర్ ఏంటంటే.. రెండు రోజుల క్రితం గుంటూరు కారం మూవీ నుంచి రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ పై ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే కదా.

ఈ పాట లోని ట్యూన్ ని తమన్ కాపీ కొట్టాడు అంటూ, లిరిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయని, అసలు సాహిత్యమే లేదని, క్రేవింగ్ క్రేవింగ్ అనే పదాలు తప్పితే ఇంకేం లేదంటూ నెటిజన్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో తన మీదపై ఎలాంటి ట్రోల్స్ వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యే రామజోగయ్య శాస్త్రి ఓ మై బేబీ సాంగ్ ట్రోలింగ్ పై స్పందిస్తూ తనదైన స్టైల్ లో కాస్త గట్టిగానే కౌంటర్స్ ఇచ్చాడు.

అయినా కూడా ఈయనపై ట్రోల్స్ ఆగలేదు. ఇక ఈ ట్రోలింగ్ తో రామజోగయ్య శాస్త్రి హర్ట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఆయన ట్విట్టర్ అకౌంట్ కనిపించడం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కి, నెగిటివిటీకి తట్టుకోలేక రామజోగయ్య శాస్త్రి తనకు తానే ట్విట్టర్ నుంచి వైదొలిగాడా? లేక తాత్కాలికంగా ట్విట్టర్ కు దూరంగా ఉన్నాడా? అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఆయన ట్విట్టర్ అకౌంట్ కనిపించకపోవడం సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతుంది.

మరోవైపు గుంటూరు కారం సాంగ్స్ పై ఇంత జరుగుతున్నా తమన్ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. నిజానికి గుంటూరు కారం సాంగ్స్ తమన్ కి అగ్ని పరీక్ష లాగా మారాయి. ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా సాంగ్ కి మొదట్లో ఇలానే విమర్శలు వచ్చాయి. చివరికి యూట్యూబ్లో ఏదోలా ట్రెండ్ అయింది. ఏ ముహూర్తాన ఈ సినిమాని స్టార్ట్ చేశారో కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా సినిమాపై ఏదో ఒక నెగెటివిటీ వస్తూనే ఉంది.

మొదట్లో సినిమా నుంచి ఎవరో ఒకరు తప్పుకోవడం, ఎప్పటికప్పుడు షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడం, సినిమా నుంచి లీక్స్ వస్తుండడం, ఇప్పుడు పాటల పై ట్రోలింగ్.. ఇలా ఎన్నో సమస్యలను దాటుకొని వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తయినట్లు చెబుతున్నారు. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. దాన్ని కూడా వారం రోజుల్లోనే పూర్తి చేయబోతున్నారని సమాచారం.

Tags:    

Similar News