మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. RC16 అప్డేట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు. అప్పటి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు రెగ్యులర్ షూట్ కు వెళ్తుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది.
రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాని నవంబర్ నెలాఖరున సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మైసూరులో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరోవైపు RC16 కోసం హైదరాబాద్ నగర శివార్లలో ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మైసూర్ షూట్ పూర్తైన తర్వాత, హైదరాబాద్ సెట్స్ లో షూటింగ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆల్రెడీ 'గేమ్ ఛేంజర్' వర్క్ పూర్తవడంతో, వీలైనంత త్వరగా చరణ్ తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చెయ్యాలని చేస్తున్నారు.
రామ్ చరణ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో RC 16 తెరకెక్కనుంది. ఉత్తరాంధ్ర రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే రా అండ్ రస్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అనే ప్రచారం జరుగుతోంది. దీని కోసం రామ్ చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. ఉత్తరాంధ్ర కుర్రాడిగా రగ్గుడ్ లుక్ ను ట్రై చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం చెర్రీ ఆఫ్ లైన్ లో మెయింటైన్ చేస్తున్న లుక్ ఈ సినిమా కోసమే. ఇక ఆయన మాట్లాడే స్లాంగ్ కూడా కొత్తగా ఉండబోతోంది. 'రంగస్థలం' తరువాత చేస్తున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఇందులో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుంది. 'దేవర' తర్వాత ఆమె నటించే రెండో తెలుగు సినిమా ఇది. ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ స్థాయితో తెరకెక్కే ఈ పాన్ ఇండియా మూవీలో ఇతర భాషల్లోని పాపులర్ నటీనటులను భాగం చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. చాన్నాళ్ల క్రితమే మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న చెర్రీ.. ఇప్పుడు తన క్రేజ్ ను నిలబెట్టుకునేలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. శంకర్ డైరెక్షన్ లో ఆయన హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.