దేవర.. ఈ టైమ్ లో RRR అవసరమే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

Update: 2024-09-15 04:49 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోయే ఈ సినిమాని వీలైనంత స్ట్రాంగ్ గా జనాల్లోకి పంపించే ప్రయత్నం ఎన్టీఆర్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే కరణ్ జోహార్, అలియాభట్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అలాగే సందీప్ రెడ్డి కూడా దేవర టీమ్ ని ఇంటర్వ్యూ చేశాడు. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో కలిసి దేవర టీమ్ తో ముచ్చటించబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో ఈ ఇంటర్వ్యూలు రిలీజ్ అవ్వనున్నాయి. ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీ ప్రమోషన్స్ లో మరొక సర్ ప్రైజ్ ఇంటర్వ్యూని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సౌత్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ హిట్ అయ్యింది. భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.

ఈ సినిమా సక్సెస్ తర్వాత మూవీ క్రెడిట్ విషయంలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్యలో సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఎవరికి వారు ఈ సినిమా సక్సెస్ కి కారణం మా హీరో అంటే మా హీరో అని గొడవ పడ్డారు. చాలా కాలం పాటు సోషల్ మీడియాలో ఈ వివాదం నడిచింది. ఈ బిగ్ కాంట్రవర్సీ చాలాకాలం పాటు నడిచింది. అయితే దీనికి అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని మీడియా సర్కిల్ లో వినిపిస్తోంది.

రాజమౌళితో పాటుగా రామ్ చరణ్ ‘దేవర’ మూవీ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే కచ్చితంగా అది సెన్సేషనల్ ఇంటర్వ్యూ అవుతుంది. అలాగే ‘దేవర’ సినిమాకి కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. ఫ్యాన్స్ వార్ నడుస్తున్న సమయంలో అందరూ ఒకటే అనే భావనని రిప్రజెంట్ చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. అలాగే నెక్స్ట్ రాబోయే ‘గేమ్ చేంజర్’ కి కూడా ఇది చాలా ప్లస్ అవుతుంది. ఇప్పుడు ‘దేవర’ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ పార్టిసిపేట్ చేస్తే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ‘దేవర’కి దొరుకుతుంది.

తరువాత ‘గేమ్ చేంజర్’ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఆ చిత్రానికి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్స్ కి పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ క్రియేట్ అయిన నేపథ్యంలో ఇలా ఒకరి సినిమాని ఇంకొకరు ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆందరి హీరోల అభిమానులు కలిసి తెలుగు సినిమాని సపోర్ట్ చేయాలి. అప్పుడే బలంగా మన సినిమా ఇండియన్ మార్కెట్ ని రూల్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. గతంలో నాని, రవితేజలు ‘దసరా’, ‘రావణాసుర’ సినిమాల రిలీజ్ సమయంలో ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇప్పుడు స్టార్ హీరోల మధ్య కూడా అలాంటి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి రాజమౌళి నేతృత్వంలో దేవర - గేమ్ ఛేంజర్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News