వెనుక ఆయన ఉన్నాడనే ధీమాతోనే!
రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా అనగానే కొంత ఆశ్చర్యం వ్యక్తమైన సంగతి తెలిసిందే
రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా అనగానే కొంత ఆశ్చర్యం వ్యక్తమైన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు దర్శకుడిగా కేవలం చేసింది ఒక్క సినిమానే. `ఉప్పెన` తో మంచి విజయం అందుకున్నా! దర్శకుడిగా అతని అనుభవం ఎంత? అన్న క్శశ్చన్ రెయిజ్ అయింది. కానీ అన్నం ఉండికిందా? లేదా? అని తెలియడానికి ఒక మెతుక పట్టుకుని చూస్తే చాలు కదా? అలా `ఉప్పెన` విజయం ఓ మెతుకులా చరణ్ కి కనిపించింది. ఆ నమ్మకంతోనే బుచ్చిబు స్టోరీ నచ్చడంతో అవకాశం కల్పించారు.
అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఓ కథ పట్టుకుని ఎన్నాళ్లు తిరిగాడో తెలిసిందే. కాంబినేషన్ సెట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. స్టోరీ సెట్ కాక కుదర లేదు. లేక బుచ్చిబాబు టైగర్ ని హ్యాండిల్ చేయలేడని ఛాన్స్ ఇవ్వలేదా? అన్నది ఓసస్పెన్స్. కానీ చరణ్ తో ఛాన్స్ అందుకుని అన్ని రకాల విమర్శలకు బుచ్చిబాబు చెక్ పెట్టేసాడు. ఇక్కడే చరణ్ కి మరో మొండి ధైర్యం కూడా ఉందని తెలుస్తోంది.
బుచ్చిబాబు వెనుక సుకుమార్ కూడా ఉండటంతోనే చరణ్ ఈ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారు? అన్నది ఇండ స్ట్రీ నుంచి అంతే బలంగా వినిపిస్తున్న ప్రచారం కూడా ఉంది. బుచ్చిబాబు ఎలాంటి తప్పులు చేసినా వెనుకుండి కరెక్ట్ చేయడానికి సుకుమార్ ముందున్నాడు కాబట్టి చరణ్ బుచ్చిబాబుకి రెండవ సినిమా అయినా అవకాశం కల్పించినట్లు కొంతమంది భావన. `ఉప్పెన` విషయంలో సుకుమార్ ఇలాగే సహాయం అందించారు. చిరంజీవి-సుకుమార్ బుచ్చిబాబుకి కావాల్సినంత సహకారం..బూస్టింగ్ ఇవ్వడంతోనే `ఉప్పెన` సక్సెస్ చేయగలిగాడు. ఇప్పుడు చరణ్ అవకాశం కల్పించి బుచ్చిబాబుని పాన్ ఇండియాలో ఫేమస్ చేయడానికి నడుం బిగించారు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న `పుష్ప-2` ఆగస్టులో రిలీజ్ అయితే సుక్కు ఖాళీనే. సరిగ్గా అదే సమయా నికి ఆర్ సీ 16 పట్టాలెక్కుతుంది. సుకుమార్ కూడా ఏడాది పాటు గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో ఆర్ సీ 16కి కావాల్సిన అన్ని రకాల సహాకారం శిష్యుడుకి అన్ని రకాలుగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో చరణ్-సుకుమార్ కాంబినేషష్ లో రిలీజ్ అయిన `రంగస్థలం` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.