20 రోజుల్లో మెగా ప‌వ‌ర్ స్టార్ కి రిలీఫ్!

అయితే ఇప్పుడా అసంతృప్తికి, చ‌ర‌ణ్ ఎగ్జైట్ మెంట్ కి తెర ప‌డే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది.

Update: 2024-06-19 06:57 GMT

ఆర్సీ 16 సెట్స్ కి ఎప్పుడెప్పుడు వెళ్దామా? అని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నాడు. అంత‌గా ఆ క‌థ‌కి చ‌ర‌ణ్ క‌నెక్ట్ అయ్యాడు. `గేమ్ ఛేంజ‌ర్` నుంచి శంక‌ర ఎప్పుడు రిలీవ్ ఇస్తాడా అని ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తోన్న స‌మ‌యం కూడా ఇదే. షూట్ డిలే అవ్వ‌డం కూడా చ‌ర‌ణ్ లో అసంతృప్తికి మ‌రో కార‌ణం కూడా అనుకోండి. అయితే ఇప్పుడా అసంతృప్తికి, చ‌ర‌ణ్ ఎగ్జైట్ మెంట్ కి తెర ప‌డే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది.

ఇంకా 20 రోజుల్లో చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ నుంచి రిలీవ్ అయిపోతాడు. ఇప్ప‌టికే షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. చ‌రణ్ పై ఇంకా కేవ‌లం 20 రోజుల షూట్ మాత్ర‌మే మిగిలి ఉంద‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం. ఆయ‌న‌పై సోలో షూట్ 5 రోజులు, ఇత‌ర న‌టీన‌టుల‌తో క‌లిసి ప‌నిచేయాల్సింది 15 రోజులు మాత్ర‌మే ఉందిట‌. మొత్తంగా 20 రోజులు గేమ్ ఛేంజ‌ర్ సెట్స్ కి చ‌ర‌ణ్ హాజ‌రైతే స‌రిపోతుంది.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ డ‌బ్బింగ్ ప‌నుల్లోనే చ‌ర‌ణ్ అవ‌స‌రం ఉంటుంది. అంత‌వ‌ర‌కూ చ‌ర‌ణ్ తో శంక‌ర్ కి ఎలాంటి ప‌ని ఉండ‌ద‌న చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతోంది. రామ్ చ‌ర‌ణ్ కూడా హాజ‌ర‌వుతున్నాడు. కాబ‌ట్టి చ‌ర‌ణ్ ఇప్పుడు బుచ్చి బాబు సినిమాకి డేట్లు ఎలాంటి సందేహం లేకుండా కేటాయించొచ్చు. ఎలా లేద‌న్నా జులై నుంచి చ‌ర‌ణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించొచ్చు.

బుచ్చిబాబు కూడా సిద్దంగానే ఉన్నాడు. మ‌రోవైపు హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ కూడా ఎంపికైంది. ఆ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డాల్సిన ప‌నిలేదు. చ‌ర‌ణ్ క్లారిటీగా డేట్లు ఇచ్చేస్తే బుచ్చిబాబు ఓ ప్లానింగ్ ప్ర‌కారం ముందుకెళ్లిపోతాడు. ద‌ర్శ‌కుడిగా బుచ్చికిది రెండ‌వ సినిమా. ఓ పెద్ద స్టార్ తో ప‌నిచేయ‌డం కూడా ఇదే తొలిసారి. రెహ‌మాన్ లాంటి సంగీత దిగ్గ‌జాన్ని కూడా బుచ్చిబాబు హ్యాండిల్ చేస్తున్నాడు. కాబ‌ట్టి చ‌ర‌ణ్ తో అసౌక‌ర్యానికి గుర‌య్యే ఛాన్స్ లేదు. చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుల హీరో, వాళ్ల‌కి కావాల్సిన అన్ని ర‌కాల స్వేచ్ఛ‌ని చ‌ర‌ణ్ క‌ల్పిస్తాడు.

Tags:    

Similar News