ఆర్ సీ 16 లోనూ చరణ్ డ్యూయల్!
ఈ పాత్ర సినిమాలో ఎంతో బలంగా ఉంటుందని...మెయిన్ లీడ్ ఇదే అవుతుందని లీకైంది. మరి ఇందు లో నిజమెంతో తెలియాలి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ చిత్రం పనులు షురూ అయిన సంగతి తెలిసిందే. తన 15వ చిత్రం `గేమ్ ఛేంజర్` షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో! కొత్త సినిమా పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆడిషన్ పనులు కూడా మొదలయ్యాయి. దీనిలో భాగంగా ఈసారి ఉత్తరాంద్ర ప్రతిభకు బుచ్చి బాబు పట్టం కట్టే పనిలో పడ్డాడు. విశాఖ.. విజయ నగరం ..శ్రీకాకుళం జిల్లాల మారుమూల ప్రాంతాల వారికి అవకావం కల్పిస్తూ స్టార్ హంట్ ని నిర్వహిస్తున్నాడు.
ప్రతిభావంతులు ఎవరైనా తన సినిమాలో అవకాశం వినియోగించుకోవాలని కోరాడు.ఈ నేపథ్యంలో చరణ్ పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా అందింది. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనిపించు న్నాడుట. రెండు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయని... ఓపాత్ర మన్యం జీవిన శైలిని పోలి ఉంటుందని అంటున్నారు. బుచ్చిబాబు ఉత్తరాంద్ర నటుల్ని తీసుకోవడం వెనుక కూడా ఈ లాజిక్ ఉందని వినిపిస్తుంది.
ఈ పాత్ర సినిమాలో ఎంతో బలంగా ఉంటుందని...మెయిన్ లీడ్ ఇదే అవుతుందని లీకైంది. మరి ఇందు లో నిజమెంతో తెలియాలి. మరోవైపు చరణ్ `గేమ్ చేంజర్` లో కూడా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమా పొలిటికల్ కమ్ తనదైన మార్క్ సమాజంపై సెటైరికల్ గా సినిమా ఉంటుందని ఇప్పటీకే ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో చరణ్ పాత్రని రెండు రకాలుగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇదే నిజమైతే! చరణ్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో డ్యూయల్ రోల్ పోషించడం ఆసక్తికరమే.
ఇలా డ్యూయల్ రోల్ చరణ కి ప్లస్ అయితే పర్వాలేదు. ఇప్పటివరకూ చరణ్ మూడు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసాడు. తొలిసారి రాజమౌళి దర్శకత్వం వహించిన `మగధీర`లో పోషించాడు. ఈ సినిమా అతన్ని 100 కోట్ల హీరోని చేసింది. అటుపై వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన `నాయక్` లోనూ డ్యూయల్ రోల్ చేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
అటుపై వంశీ పైడిపల్లితో `ఎవడు` సినిమా చేసాడు. ఇందులో కూడా డ్యూయల్ రోల్ పోషించాడు. కాకపోతే ఒక పాత్ర కోసం బన్నీ ఫేస్ ని దించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ రకంగా చరణ్ డ్యూయల్ రోల్స్ ఇంతవరకూ ఫెయిలైంది లేదు. మరి తాజా ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.