రామ్ చ‌ర‌ణ్ ఒకే ఒక్క‌డు చూసాడా?

`గేమ్ ఛేంజ‌ర్` లో రామ్ చ‌ర‌ణ్ రోల్ ఎలా ఉంటుంది? అన్న దానిపై లీకుల్ని బ‌ట్టి ఇప్ప‌టికే ఓ ఐడియా వ‌చ్చేసింది.

Update: 2024-06-01 00:30 GMT

`గేమ్ ఛేంజ‌ర్` లో రామ్ చ‌ర‌ణ్ రోల్ ఎలా ఉంటుంది? అన్న దానిపై లీకుల్ని బ‌ట్టి ఇప్ప‌టికే ఓ ఐడియా వ‌చ్చేసింది. ఐఏఎస్ అధికారి రాజ‌కీయ నాయ‌కుడిగా ట‌ర్న్ అయితే క‌థ ఎలా సాగింద‌న్న‌ది శంక‌ర్ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా హైలైట్ చేస్తున్నారు. చ‌ర‌ణ్ ఐఏఎస్ ప్రీ లుక్ సినిమా ప్రారంభానికి ముందే లాంచ్ చేసారు. చ‌ర‌ణ్ తో పాటు కియారా..శంక‌ర్..దిల్ రాజు సైతం సూటుబూటు వేసి ప్ర‌భుత్వ అధికారుల్నే త‌ల‌పించారు. ఆ కాన్సెప్ట్ పోస్ట‌ర్ తోనే సినిమా పై ఓ ఐడియా అంద‌ర్నీలోని మొద‌లైంది.

కానీ రాజ‌కీయ‌నాయకుడిగా మారిన త‌ర్వాత చ‌ర‌ణ్ రోల్ ఎలా ఉంటుంది? అన్న‌ది మాత్రం ఇత‌వ‌ర‌కూ ఎక్క‌డా క‌నీసం లీక్ కూడా బ‌య‌ట‌కు రాలేదు. సెట్స్ నుంచి ఎక్క‌డా లీక్ కూడా రాకుండా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తో ప‌నిచేస్తున్నారు. సినిమాలో ఆపాత్రే హైలైట్ చేస్తున్నారు కాబ‌ట్టి ఇన్ని ర‌కాలుగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా ఒకే ఒక్క‌డు లా ఉంటుంద‌ని కొన్ని గెస్సింగ్స్ తెర‌పైకి వ‌చ్చాయి.

సామాజిక బాద్య‌త కొణాన్ని శంక‌ర్ ఈసారి బ‌లంగా ట‌చ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ లీక్ అందింది. ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ ఇంటిలో ఉన్న ప్రీవ్యూ థియేట‌ర్ లో డాడ్ చిరంజీవితో క‌లిసి `ఒకే ఒక్క‌డు` సినిమా చూసార‌ని తెలిసింది. అందులో పొలిటీష‌న్ కం సీఎం పాత్ర పోషించిన ర‌ఘువ‌ర‌న్ పాత్ర లో ఆత్మ‌ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు మెగా లీకులందుతున్నాయి. ర‌ఘువ‌ర‌న్ ఆహార్యం, అత‌డి ఎక్స్ ప్రెష‌న్స్ ఎలా క్యారీ చేసారు? వంటి అంశాల్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాడుట‌.

అవ‌స‌రం మేర డాడ్ నుంచి కూడా చ‌ర‌ణ్ కొన్ని స‌ల‌హాలు తీసుకున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి చ‌ర‌ణ్ ఒకే ఒక్క‌డు ద్వారా కూడా కొన్ని ఇన్ పుట్స్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి పాత్ర‌లు చ‌ర‌ణ్ పోషించింది లేదు. వాటిలో ఏమాత్రం అనుభ‌వం లేదు. ఈ సినిమా కూడా ఒకే ఒక్క‌డు లా ఉంటుంద‌ని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే `గేమ్ ఛేంజ‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ లాంఛ‌న‌మే.

Tags:    

Similar News