ఉపాసన కాళ్ళు పట్టుకున్న రామ్ చరణ్

తాజాగా రామ్ చరణ్, ఉపాసన అనిల్ అంబానీ కొడుకు మ్యారేజ్ కి స్పెషల్ చాపర్ లో వెళ్ళారు.

Update: 2024-03-02 04:16 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంత పెద్ద స్టార్ అయిన కూడా పవన్ కళ్యాణ్ తరహాలోనే క్యాజువల్ గా ఉంటాడు. ప్రస్తుతం రామ్ చరణ్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మెగాస్టార్ వారసుడిగా అరంగేట్రం చేసిన తండ్రిని మించిన తనయుడు అని రామ్ చరణ్ ఇప్పుడు అనిపించుకుంటున్నాడు. రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఎక్కడికి వెళ్ళిన ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఉపాసనకి రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో అంతే స్థాయిలో ఉపాసన అన్నా కూడా చరణ్ కి ఇష్టం.

ఆమె వచ్చాక రామ్ చరణ్ లైఫ్ స్టైల్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. పాజిటివిటీ కూడా పెరిగింది. తాజాగా రామ్ చరణ్, ఉపాసన అనిల్ అంబానీ కొడుకు మ్యారేజ్ కి స్పెషల్ చాపర్ లో వెళ్ళారు. అందులో అలసిపోయి రిలాక్స్ అయిన ఉపాసన పాదాలు రామ్ చరణ్ నొక్కుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో రామ్ చరణ్ భార్యకి ప్రేమతో పతిసేవ చేస్తున్నారు. ఒక భర్త నుంచి అమ్మాయిలు ఎలాంటి ప్రేమ కోరుకుంటారో అలాంటి ప్రేమని ఉపాసన విషయంలో రామ్ చరణ్ చూపిస్తున్నాడని ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత రామ్ చరణ్ ని ద్వేషించే వారు ఉన్న అతనికి అభిమానులుగా మారిపోతారనే మాట వినిపిస్తోంది.

బెస్ట్ హస్బెండ్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు రామ్ చరణ్ లో ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది ఆడవారిపై పెత్తనం చేయడం మగతనం అనుకుంటారు. కాని ప్రేమించే భార్యకి భర్తగా సేవ అందించడంలోనే నిజమైన గొప్పతనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. వీడియో చూసిన తర్వాత రామ్ చరణ్ ని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రశంసిస్తూ ఉన్నారు.

Tags:    

Similar News