చ‌ర‌ణ్-ఉపాస‌న మ‌ధ్య‌లో క్లిన్.. ఏం జ‌రుగుతోంది?

క్యూట్ క్లిన్ కారాను చెరో చేయి ప‌ట్టుకుని న‌డిపిస్తున్న తీరు హృద‌యాల‌ను ట‌చ్ చేస్తోంది.

Update: 2024-06-16 06:39 GMT

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల 12వ‌ వివాహ వార్షికోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారింది. దీనికి అభిమానుల నుంచి పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో అంటూ కాంప్లిమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ జంట జూన్ 14 నాటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా షేర్ చేసిన ఫోటోలో రామ్ చరణ్ - ఉపాసన త‌మ గారాల ప‌ట్టీ క్లిన్ కారా కొణిదెల చేతుల‌ను చెరోవైపు పట్టుకుని ముందుకు న‌డుస్తూ క‌నిపించారు. వారి వెనుకభాగం నుంచి క్లిక్ చేసిన ఫోటో ఆక‌ట్టుకుంటోంది. చరణ్ లేత గోధుమరంగు చొక్కా కాంబినేష‌న్ ప్యాంటు ధరించి కనిపిస్తుండగా, ఉపాసన క్యాజువ‌ల్స్ ధరించినట్లు కనిపించింది. క్యూట్ క్లిన్ కారాను చెరో చేయి ప‌ట్టుకుని న‌డిపిస్తున్న తీరు హృద‌యాల‌ను ట‌చ్ చేస్తోంది.

ఈ ఫోటోకు ఉపాస‌న అంద‌మైన‌ క్యాప్ష‌న్ ఇచ్చారు.``12 సంవత్సరాల పాటు కలిసిమెలిసి ..! మీ ప్రేమ & శుభాకాంక్షలకు అందరికీ ధన్యవాదాలు. మా జీవితాలను నిజంగా అద్భుతంగా మార్చడంలో మీలో ప్రతి ఒక్కరు ప్రత్యేక పాత్ర పోషించారు. చాలా కృతజ్ఞతలు!`` అని రాసింది. చ‌ర‌ణ్ అభిమానులనుద్ధేశించి ఉపాస‌న రాసిన లేఖ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది.

దీనికి రామ్ చ‌ర‌ణ్ అంతే ఆహ్లాదంగా స్పందించారు. ``UPs ... నీతో భాగ‌స్వామిగా కొన‌సాగ‌డాన్ని నేను ఎంతో ఆస్వాధిస్తున్నాను.. !`` అని చ‌ర‌ణ్ త‌న ప్రేమ‌ను కురిపించారు. రామ్ చరణ్ - ఉపాసన కాలేజీలో కలిసి చ‌దువుకున్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. ఆ తర్వాత ఒక‌రిపై ఒక‌రికి లవ్ ఉంద‌ని గ్ర‌హించాక .. ప్రేమ వివాహం జ‌రిపేందుకు పెద్ద‌లు నిశ్చ‌యించారు. వీరికి 2012లో పెళ్ల‌యింది. వీరిద్దరూ 2023 జూన్ 20న‌ తమ మొదటి బిడ్డ క్లిన్ కారా కొణిదెలకి స్వాగతం పలికారు. క్లిన్ ఇప్పుడు చూస్తుండ‌గానే వేగంగా ఎదిగేస్తోంది.

Tags:    

Similar News