రామ్‌చ‌ర‌ణ్‌కు చెన్నై వ‌ర్శిటీ గౌర‌వ‌ డాక్ట‌రేట్

శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ తో మ‌రో స్థాయికి ఎదిగేందుకు శ్ర‌మిస్తున్నాడు.

Update: 2024-04-11 12:18 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన మైలురాళ్ల‌ను అందుకుంటున్నారు. ఇంత‌కుముందు ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో న‌టించాడు. చ‌ర‌ణ్ తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తన మొదటి సినిమా నుండి.. చివరి బ్లాక్‌బస్టర్ RRR వరకు అతడు ఎల్లప్పుడూ కొత్త ప్రమాణాలను సెట్ చేస్తూనే ఉన్నాడు. శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ తో మ‌రో స్థాయికి ఎదిగేందుకు శ్ర‌మిస్తున్నాడు.

అత‌డి కృషి వృధా పోవ‌డం లేదు. ఇప్పుడు మ‌రో అరుదైన గౌర‌వం అందుకున్నాడు చ‌ర‌ణ్‌. చెన్నైలోని యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ కాన్వొకేషన్ వేదికగా చ‌ర‌ణ్‌ గౌరవ డాక్టరేట్ అందుకుంటారు. ఏప్రిల్ 13న కాన్వకేషన్ వేడుకలో ఈ గౌర‌వం ద‌క్క‌నుంది. ఈ విశేషమైన అచీవ్‌మెంట్ రామ్ చరణ్ చిత్ర పరిశ్రమలో చేసిన విశేష కృషికి గానూ వేల్స్ యూనివర్శిటీ హానర‌రీ డిగ్రీని ప్రదానం చేసింది. చెన్నై వేల్స్ వ‌ర్శిటీ కాన్వకేషన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేయ‌నున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స‌మ‌క్షంలో చ‌ర‌ణ్ అరుదైన గౌర‌వం అందుకుంటుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఈ అవార్డుతో అత‌డి గుర్తింపు విశ్వ‌విఖ్యాతం కానుంది. రామ్ చరణ్ తేజ్ 2007లో చిరుత చిత్రంతో కెరీర్ ప్రారంభించి అద్భుతమైన నటనతో త‌న‌కంటూ ఒక మార్గాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇటీవ‌లి బ్లాక్‌బస్టర్ చిత్రం RRR తో న‌టుడిగా కొత్త ప్రమాణాలను సెట్ చేసాడు. నిరంత‌రం హార్డ్ వ‌ర్క్ తో త‌న స్థాయిని పెంచుకునేందుకు విశ్ర‌మించ‌నివాడిగా చ‌ర‌ణ్‌కి గుర్తింపు ద‌క్కుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రామ్ చరణ్ ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజర్` చిత్రీక‌ర‌ణ‌, రిలీజ్ పైనే ఫోక‌స్ చేసాడు. శంక‌ర్ తెర‌కెక్కించిన‌ ఈ భారీ-బడ్జెట్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 2024లో థియేటర్లలో విడుదల కానుంది. త‌దుప‌రి దర్శకుడు బుచ్చి బాబు సనాతో స్పోర్ట్స్ డ్రామా రెగ్యుల‌ర్ షూట్ కోసం స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇటీవ‌ల ఈ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News