మీరు నమ్మకుంటే శివ, నేనూ లేము : వర్మ
కానీ చాలా తక్కువ సమయంలో మాత్రమే కాస్త ఎమోషనల్‌గా, కృతజ్ఞత పూర్వకంగా ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతి పోస్ట్ చాలా ఆసక్తికరంగా, ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది. తాజాగా ఆయన మొదటి సినిమా శివ విడుదల అయి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తనకు సెట్ అవ్వని ఒక ఎమోషనల్ పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన చాలా స్పెషల్‌గా పోస్ట్ లు చేస్తూ ఉంటారు, ఆయన పోస్ట్ లు ముక్కు సూటిగా, కొట్టినట్లుగా, తిట్టినట్లుగా ఉంటాయి. కానీ చాలా తక్కువ సమయంలో మాత్రమే కాస్త ఎమోషనల్‌గా, కృతజ్ఞత పూర్వకంగా ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా శివ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... ఆ రోజు మీరు నన్ను నమ్మి ఉండకుంటే శివ అనే సినిమా లేదు, నేను అని ఉండేవాడిని కాదు. మీరు నమ్మడం వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, శివ సినిమా ఉందని వర్మ అన్నారు. మీ అచంచలమైన మద్దతు, నాపై ఉంచిన విశ్వాసం వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. శివ సినిమా తోనే వర్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేశాడు.
టాలీవుడ్ కి ట్రెండ్ సెట్టర్ సినిమాను అందించిన రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి దొరికిన వరం అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. టాలీవుడ్ లో సినిమాలు చేసి మంచి పేరు దక్కించుకున్న వర్మ బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి స్టార్ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. అమితాబచ్చన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సూపర్ స్టార్ అవ్వడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది రామ్ గోపాల్ వర్మ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మ అంటే అందుకే అమితాబ్ కి అమితమైన అభిమానం ఉంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఇక టాలీవుడ్ లో మొదటి సినిమా శివ ను నాగార్జునతో చేసిన వర్మకు ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం. నాగార్జున ను ఇప్పటికి ఎంతో గౌరవిస్తూ ఉంటాడు. తన సినీ కెరీర్ ఇంతగా ముందుకు సాగడానికి ప్రత్యేక కారనం, ప్రథమ కారణం నాగార్జున అని వర్మ ఎన్నో సందర్భాల్లో అన్నారు. అన్నట్లుగానే ఏ చిన్న సందర్భం వచ్చినా నాగార్జునకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటారు. ఇటీవల మంత్రి కొండ సురేఖ అక్కినేని ఫ్యామిలీ మీద ఆరోపణలు చేసిన సమయంలో రామ్ గోపాల్ వర్మ స్పందించిన తీరుకు ప్రతి ఒక్కరు అభినందించారు. ఇండస్ట్రీ మొత్తం వర్మ ను ఫాలో అయ్యి నాగార్జున కు మద్దతుగా నిలిచారు అంటూ సోషల్ మీడియా టాక్.