ఒకే వేదికపై తెలుగు సినిమా పరిశ్రమ

కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని వివాహ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారు.

Update: 2024-08-25 05:14 GMT

తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబంలాంటిది అని ఇండస్ట్రీ పెద్దలు రెగ్యులర్ గా చెబుతూ ఉంటారు. అందుకే ఏ సెలబ్రెటీ ఇంట్లో పెళ్లి వేడుక జరిగిన, కచ్చితంగా వివాహ మహోత్సవంలో ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీ ప్రముఖులు సందడి చేస్తూ ఉంటారు. కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని వివాహ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారు. ఈ రిసెప్షన్ కి ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రెటీలు అందరూ ఇన్వైట్ చేస్తారు.


ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీ కొడుకు వివాహ వేడుక కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా జరిగింది. తాజాగా హైదరాబాద్ లోని రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రీ స్టార్ లిరిక్ రైటర్ గా దూసుకుపోతున్నారు. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా మూవీస్ వరకు అన్నింటికి సాంగ్స్ రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో సెలబ్రెటీ ప్రముఖులు అందరితో రామజోగయ్య శాస్త్రీకి మంచి అనుబంధం ఉంది.


ఆయన పాటలని ఇష్టపడని వారు ఉండరు. ఈ నేపథ్యంలో ఆయన కొడుకు వివాహ రిసెప్షన్ వేడుకకి ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీ ప్రముఖులు అందరూ హాజరయ్యారు. స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అటెండ్ అయ్యి వధూవరులని ఆశీర్వదించారు. అలాగే విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు హాజరయ్యారు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం హాజరై కొత్తజంటని బ్లెస్స్ చేశారు.


హీరో అడివి శేష్, దర్శకులు విజయ్ భాస్కర్ కె, ఎస్.వి.కృష్ణారెడ్డి, బోయపాటి శ్రీను, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు హాజరయ్యారు. అలాగే గాయకులు, సంగీత కళాకారులు రామ్ మిర్యాల, అర్మాన్ మాలిక్, అనంత శ్రీరామ్, ధనుంజయ్, రమ్య బెహరా, కౌశల్య, శ్రీరామచంద్ర వంటి వారు హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. ఈ ఏడాది వచ్చిన మోస్ట్ హిట్ సాంగ్స్ రామజోగయ్య శాస్త్రీ రాసినవే కావడం విశేషం.


గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి నుంచి దేవరలో చుట్టమల్లే వరకు సూపర్ హిట్ సాంగ్స్ ని రామజోగయ్య శాస్త్రీ రాశారు. అలాగే కల్కిలోని పాటలని కూడా రామజోగయ్య శాస్త్రీ రాయడం విశేషం. దేవరాలోని ఆయన రాసిన చుట్టమల్లే సాంగ్ ప్రస్తుతం యుట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా ఉంది.

Tags:    

Similar News