RAM మూవీ సెన్సార్.. లాస్ట్ 40నిమిషాలు స్టన్నింగ్

దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.

Update: 2024-01-23 13:33 GMT

రిపబ్లిక్ డే సందర్భంగా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండేట్టుగా కనిపిస్తోంది. ఈ వారం రిలీజ్ కాబోతున్న చిత్రాలన్నింటిలో రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్)పై అందరి దృష్టి పడింది. దేశ భక్తిని చాటే సినిమాగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.


రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.

ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్ బోర్డు సభ్యులు. 144 నిమిషాల (రెండు గంటల 24 నిమిషాలు) నిడివితో రాబోతోన్న ఈ చిత్రంలో చివరి 40 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌ లు బాగున్నాయని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. మంచి సందేశాత్మకంగా చిత్రంగా నిలుస్తుందని కొనియాడారు.

విడుదలకు ముందే సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం గ్రేటే అని చెప్పొచ్చు. రీసెంట్‌గా స్టార్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా స్పెషల్ స్క్రీనింగ్‌ లో ఈ సినిమాను చూసి టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. జనవరి 26వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

దీపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై ఓఎస్ఎం విజన్‌ తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా దీపికాంజలి ఈ సినిమాను నిర్మించారు. కమర్షియల్, యాక్షన్, దేశభక్తి జోనర్లలో తెరకెక్కిన ఈ మూవీలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, అమిత్ కుమార్ తివారీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి అశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా, ధరణ్ సుక్రే సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. దేశభక్తిని చాటే చిత్రాలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. పేట్రియాటిక్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు సిద్దంగా ఉంటారు. మరి ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News