సైలెంట్ గా మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన రామ్
పూరి జగన్నాథ్ కూడా ఈ మూవీ ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా చేస్తున్నారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వరుసగా ది వారియర్, స్కంద సినిమాలతో ఇటీవల వరుస చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్నారు. రామ్, పూరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది. ఈ కారణంగానే మూవీ పైన రామ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.
పూరి జగన్నాథ్ కూడా ఈ మూవీ ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా చేస్తున్నారు. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ పనైపోయింది అనే విమర్శలకి డబుల్ ఇస్మార్ట్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ పోతినేని చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో నెలకొని ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రామ్ పోతినేని సినిమా ఉంటుందనే టాక్ వినిపించింది.
అలాగే మరికొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ డైరెక్టర్ గా మహేష్ బాబు సెట్టయినట్లు తెలుస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో మహేష్ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రారా క్రిష్నయ్య మూవీతో మహేష్ బాబు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకొని అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబోలో సినిమా చేసి హిట్ అందుకున్నాడు.
ఈ యంగ్ డైరెక్టర్ రీసెంట్ గా రామ్ పోతినేనికి ఒక ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీని నేరేట్ చేసాడంట. కథ రామ్ కి బాగా నచ్చడంతో ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే ఈరోజు ఈ సినిమా అఫీషియల్ గా లాంచ్ అయింది. షూటింగ్ ప్రారంభానికి ముందే మేకర్స్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కథానాయిక మరియు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఖరారు కావాల్సి ఉంది షూటింగ్ లాంఛనాలు ఆగస్టులో ప్రారంభమవుతాయి. టైటిల్ పెట్టని ఈ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని తెలుస్తోంది. త్వరలో సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందంట.
ప్రస్తుతం రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులు ఆగింది. మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూస్ పరిష్కారం కావడంతో మరల షూటింగ్ స్టార్ట్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ కంప్లీట్ అయ్యాక మహేష్ చెప్పిన కథని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.