రామ్ కి అట్లీ, జెనీలియా అంత క్లోజా!
టాలీవుడ్ హీరోలకు క్లోజ్ ప్రెండ్స్ అంటే ఎవరుంటారు? తెలుగు పరిశ్రమకు చెందిన వారే ఉండటానికి అవకాశం ఉంటుంది
టాలీవుడ్ హీరోలకు క్లోజ్ ప్రెండ్స్ అంటే ఎవరుంటారు? తెలుగు పరిశ్రమకు చెందిన వారే ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతా హైదరాబాద్ లోనే ఉంటారు. ఒకే పరిశ్రమలో కలిసి మెలిసి పనిచేస్తారు కాబట్టి క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` తో క్లోజ్ ప్రెండ్స్ గా మారారు. `బాహుబలి`తో ప్రభాస్-రానా క్లోజ్ అయ్యారు.
గోపీచంద్-ప్రభాస్ నటులు కాకముందే బెస్ట్ ప్రెండ్స్ గా ఉన్నారు. ఇలా చాలా మంది హీరోల బెస్టీ ఎవరంటే? టాలీవుడ్ కి చెందిన నటుల పేర్లే చెబుతారు. కానీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు. టాలీవుడ్ లో అతడికి క్లోజ్ ప్రెండ్స్ లేనట్లే కనిపిస్తుంది. మీకు బాగా దగ్గరైన స్నేహితులు ఎవరు అంటే ముంబై లో ఉన్న వాళ్లని...చెన్నై లో ఉన్న సెలబ్రిటీల పేర్లు చెప్పాడు.
జెనిలీయా బెస్ట్ ప్రెండ్ అన్నాడు. ఇద్దరు కలిసి `రెడీ` సినిమా చేసిన సమయంలో బాగా క్లోజ్ అయ్యామని తెలిపాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతుందన్నాడు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉన్నా? తాను హైదరాబాద్ లో ఉన్నా స్నేహం మాత్రం అలాగే కొనసాగుతుందన్నాడు. అలాగే తమిళ డైరెక్టర్ అట్లీ కూడా బెస్ట్ ప్రెండ్ అట. అతని భార్య కృష్ణ ప్రియ కూడా మంచి స్నేహితురాలు అని తెలిపాడు.
అయితే వీళ్లిద్దరు ఎలా క్లోజ్ అయ్యారు? అన్నది మాత్రం చెప్పలేదు. అట్లీ తో రామ్ ఇంతవరకూ సినిమాలు చేసింది లేదు. కృష్ణప్రియు నటి కాబట్టి ఏదో సినిమాలో నటించి ఉండొచ్చు. అయినా కూడా ఆమె హీరోయిన్ కాదు. మరి ఈ ముగ్గురి మధ్య అంత క్లోజ్ నెస్ ఎలా బిల్డ్ అయిందో తెలియాలి.