మహేష్ బాబు పైనే ఇస్మార్ట్‌ హీరో ఆశలు..!

2019లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రామ్‌ కి గుడ్‌ టైమ్ స్టార్ట్‌ అయ్యిందని అంతా భావించారు.

Update: 2024-08-26 06:58 GMT

2019లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రామ్‌ కి గుడ్‌ టైమ్ స్టార్ట్‌ అయ్యిందని అంతా భావించారు. కానీ ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తర్వాత ఆయన నుంచి వచ్చిన రెడ్‌, ది వారియర్‌, స్కంద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో మళ్లీ ఇస్మార్ట్‌ శంకర్‌ కాంబో పై ఆశ పెట్టుకుని డబుల్‌ ఇస్మార్ట్‌ ను చేశాడు. పూరి తో పాటు రామ్‌ పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయి. డబుల్‌ ఇస్మార్ట్‌ డిజాస్టర్ గా మిగిలింది. రామ్‌ ఎలా కమిట్‌ అయ్యాడు, పూరి ఎలా ఈ సినిమాను తీశాడు అంటూ సినీ విశ్లేషకులు విమర్శలు చేశారు.

వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో రామ్‌ నుంచి రాబోతున్న తదుపరి సినిమా ఏంటో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్‌ సినిమా ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ కి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాస్ ఆడియన్స్ కోసం అంటూ రామ్ ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేశాడు. కానీ అందులో ఏ ఒక్కటి విజయాన్ని సొంతం చేసుకోలేదు. అందుకే కాస్త క్లాస్ టచ్ తో ఉండే విధంగా మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

రామ్‌ గతంలో చేసిన కొన్ని క్లాస్ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి ఆ తరహా సినిమా చేయాలని నిర్ణయానికి వచ్చాడు. అందుకే మహేష్ బాబుతో అదే తరహా సినిమాను రామ్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ మరో సినిమా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా ఫైనల్‌ అవ్వాల్సి ఉంది.

మహేష్ బాబు దర్శకత్వంలో రామ్‌ చేయబోతున్న క్లాస్ మూవీ తప్పక విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రామ్‌ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుసగా నాలుగు ఫ్లాప్స్ తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో ఒత్తిడి అనేది కామన్ గా ఉంటుంది. రామ్‌ కి కూడా ఆ ఒత్తిడి అనేది ఉండే ఉంటుంది. అయితే క్లాస్ అండ్ సెన్సిబుల్‌ సబ్జెట్‌ ను తీసుకోవడం వల్ల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రామ్‌ సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్‌ వినిపిస్తుంది. మరి రామ్‌ ఆశలు నెరవేరి హిట్ కొట్టేనా చూడాలి.

Tags:    

Similar News