రాముడి పాత్రకు రణబీర్ కపూర్ అనర్హుడు!
బాలీవుడ్ దర్శకుడు రామాయణం తెరకెక్కిస్తున్నట్లు అందులో రాముడి పాత్రకు రణబీర్ కపూర్ ని తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ దర్శకుడు రామాయణం తెరకెక్కిస్తున్నట్లు అందులో రాముడి పాత్రకు రణబీర్ కపూర్ ని తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రణబీప్ కపూర్ ఇలాంటి గొప్ప పాత్ర పోషించే అవకాశం రావడంతో అంతే సంతోషాన్ని వ్యక్తం చేసాడు. రామయణం పూర్తిచేసే వరకూ మాంసాంహారం తీననని..మద్యం ముట్టననని....ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనని...రాముడు ఎంత పవిత్రంగా ఉంటాడో? తాను అంతే పవిత్రంగా సుద్ద పుసలా ఉంటానని పబ్లిక్ గా మీడియా ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటనతో చాలా మందిలో రణబీర్ కపూర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అప్పటివరకూ రణబీర్ కపూర్ ని నెగిటివ్ గా చూసే ఎంతో మంది పాజిటివ్ గా చూడటం మొదలు పెట్టారు. రణబీర్ కపూర్ తీసుకునే నిర్ణయాల్లో ఇంత కమిట్ మెంట్ ఉంటుందా? అని అంతా ప్రత్యేక అభిమానం కురిపించడం మొదలుపెట్టారు. కానీ తానెంత సుద్ద పూస అన్నది చెప్పడానికి ఈ సంఘటన చాలు అని నెటి జనులు విరుచుకు పడుతున్నారు. హిందువుల రణబీర్ కపూర్ తీరుపై మండిపడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇటీవలే రణబీర్ కపూర్ కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు ఓ హోటల్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. కపూర్ కుటుంబం యొక్క క్రిస్మస్ లంచ్ నుండి వీడియోలో రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్‌తో కలిసి కేక్ పై స్పిరిట్(ఆల్కాహాల్) పోసి వెలిగించాడు. దీంతో అది భగభగా మండింది. ఇలా తినుబండారాలపై మద్యం పోసి వెలిగించడం అన్నది హిందువుల చర్యకు వ్యతిరేకం.
ఇది హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించే అంశం. హిందూ ఆచారాలలో ఇతర దేవతల ముందు అగ్ని దేవుణ్ణి ప్రార్థించడం మరియు అందులోనూ క్రిస్మస్ వేడుకల సమయంలో ఇలా చేయడం హిందువుల్ని ఆగ్రహించేలా చేసింది. దీంతో రణబీర్ కపూర్ కుటుంబపై ఓ వ్యక్తి కేసు ఫైల్ చేసాడు. హిందువుల మనోబావాలు దెబ్బ తినేలా ఆ కుటుంబం చర్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వివాదం రణబీర్ కపూర్ కి కొత్తేం కాదు. గతంలో గొడ్డు మాంసం అంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడం..వివాదం అవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాముడి పాత్రకు రణబీర్ కపూర్ అనర్హుడిగా ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ల పర్వం మొదలైంది.