రాక్షస రానా.. మెగా ట్విస్టుతో మైండ్ బ్లాక్
టాలీవుడ్ లో బాహుబలి తర్వాత విలన్ పాత్రకి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు రానా. కానీ ఈ దగ్గుబాటి హీరో మాత్రం ఆ దిశగా అస్సలు అడుగులు వేయలేదు
టాలీవుడ్ భల్లాల దేవా రానా దగ్గుపాటి గురించి తెలిసిందే. అప్పటివరకు విభిన్న తరహా కథలతో హీరోగా ఆకట్టుకున్న రానా.. 'బాహుబలి' సినిమాతో విలన్ గా మారాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ కి ధీటుగా విలనిజం చూపించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా అన్ని సినిమాలతో రాని పాపులారిటీ బాహుబలి సినిమాతో దగ్గుబాటి రానాకి వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
టాలీవుడ్ లో బాహుబలి తర్వాత విలన్ పాత్రకి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు రానా. కానీ ఈ దగ్గుబాటి హీరో మాత్రం ఆ దిశగా అస్సలు అడుగులు వేయలేదు. బడా స్టార్ ఎదురుగా ఉంటే తప్ప విలన్ పాత్రలు చేసేది లేదని పట్టుబట్టి మరీ కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ మెగాస్టార్ చిరంజీవి సినిమా రూపంలో వచ్చింది. బింబిసారా మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సోసియో ఫాంటసీ మూవీ చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలోనే రానా విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో రానా పాత్రకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మూవీలో రానా విలనిజం ఓ రేంజ్ లో ఉంటుందట. సినిమాలో రానా ఓ రాక్షసుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. చిరంజీవి సినిమా కోసం సోషియో ఫాంటసీ కథను రెడీ చేసాడు వశిష్ట. ఇప్పటివరకు ఎవ్వరూ చూడని ఓ సరికొత్త లోకాన్ని ఈ సినిమా కోసం సృష్టించబోతున్నాడు.
ఆ లోకంలో రాక్షస రాజు లాంటి పాత్రలో రానా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో రానా గెటప్ కూడా హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో డిజైన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇదే కనుక నిజమైతే బాహుబలి తర్వాత మళ్లీ రానాకి ఆ రేంజ్ పాపులారిటీ చిరంజీవి సినిమా తోనే దక్కుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి 'విశ్వంభర' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నారట. ఇప్పటికే త్రిష ఓ హీరోయిన్గా ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని చెబుతున్నారు. మిగిలిన హీరోయిన్స్ ఎవరన్నది త్వరలోనే తేలనుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.