కొత్తగా చేద్దామనుకుంటే రెండేళ్ల గ్యాప్‌...!

ఈయన చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా పోషించిన పాత్రలతో తనదైన ముద్రను ప్రేక్షకుల మీద వేయడంలో సక్సెస్ అయ్యాడు.

Update: 2024-07-17 06:08 GMT
కొత్తగా చేద్దామనుకుంటే రెండేళ్ల గ్యాప్‌...!
  • whatsapp icon

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ క్రేజీ హీరోల్లో రానా ఒకరు. ఈయన చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా పోషించిన పాత్రలతో తనదైన ముద్రను ప్రేక్షకుల మీద వేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆయన తలుచుకుంటే ఏడాదిలో నాలుగు అయిదు సినిమాలు చేయగలడు.

సొంత బ్యానర్‌ లో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తే అందులో ఏడాదికి రెండు మూడు అయినా హిట్‌ అవుతాయి. కానీ రానా అలా కోరుకోవడం లేదు. కెరీర్ ఆరంభం నుంచి కూడా చాలా ప్రత్యేకంగా ఉండే సినిమాలను ఎంపిక చేసుకుంటూ వచ్చాడు,

గత ఏడాది విరాటపర్వం వంటి విభిన్నమైన సినిమాను చేయడం ద్వారా ఆయనలో ఉన్న నటుడు మరింతగా బయటకు వచ్చాడు. విరాట పర్వం తర్వాత రానా ఇప్పటి వరకు మరే సినిమాను కమిట్‌ అవ్వలేదు. తాజాగా ఒక అవార్డు వేడుక ప్రెస్ మీట్ లో రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రెండేళ్ల గ్యాప్ గురించి రానా మాట్లాడుతూ.. అందరు చేస్తున్నట్లుగా కాకుండా కొత్తగా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో కథలు వింటున్నాను, మంచి స్క్రిప్ట్‌ ల కోసం వెయిట్‌ చేస్తున్నాను. దాంతో రెండేళ్ల కాలం గడిచి పోయిందని అన్నాడు.

త్వరలోనే రానా నుంచి మరో విభిన్న సినిమా రాబోతుందట. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రానా కల్కి విజయం పట్ల స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. సినిమాలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు అన్నాడు.

Tags:    

Similar News