'జైభీమ్' కి అవార్డు రాకపోవడం రానా రియాక్షన్!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం `జైభీమ్` కి అవార్డు రాకపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశ చెందిన సంగతి తెలిసిందే.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం `జైభీమ్` కి అవార్డు రాకపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశ చెందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కచ్చితంగా అవార్డు వస్తుందని చాలా మంది నమ్మకంగా ఉన్నారు. నేచురల్ స్టార్ హీరో నాని సైతం ఈ సినిమాకి అవార్డు రాకవపోడంతో హృదయం ముక్కలైంది అంటూ ట్వీట్ కూడా చేసారు. ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేసారు.
తమిళనాడు సీఎం సైతం అవార్డుల విషయంలో తమకి అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రానికి కాక ఎలాంటి సినిమాలకు అవార్డలు ఇస్తారంటూ మరికొంత మంది జ్యూరీ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేసారు. తాజాగా ఈ వివాదంపై రానా సైమా అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పందించారు. సినిమాల విషయంలో అందరి అభిప్రాయలు ఒకేలా ఉండవు.
కొందరికి ఒక సినిమా నచ్చుతుంది. అది మరికొంత మందికి నచ్చకపోవచ్చు. నటుల అభిరుచులు కూడా అలాగే ఉంటాయి. జైభీమ్ కి జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అది ఎంపిక కాలేదు. దీంతో చాలా మంది అసతృప్తిని వ్యక్తం చేసారు. అంతే కానీ కాంట్రవర్శీ చేయలేదు. వాళ్లు కేవలం ట్వీట్ మాత్రమే చేసారు. కొందరు కాంట్రవర్శీ చేసారు. మా నటీనటుల మధ్య ఎలాంటి వివాదాలు ఉండవు` అని అన్నారు.
అలాగే హీరో విశాల్ కూడా నటుల ప్రతిభని ప్రోత్సహిస్తూ ఇచ్చే అవార్డులను కించ పరిచి మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల కన్నా గొప్ప అవార్డు ఏది ఉంటుందని..తనకేవైనా అవార్డులిస్తే చెత్తబుట్టలో వేస్తానని అన్నారు. తెలుగు సినిమాకి జాతీయ అవార్డులు రావడంతో కొంత మంది అక్కసుతో ఇలా ప్రవర్తించారని మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇంతలో రానా తన అభిప్రాయాన్ని షేర్ చేయడం ఆసక్తికరం.