ఆ సూపర్ స్టార్స్ తర్వాత అతడికే ఛాన్స్!
బాలీవుడ్ `డాన్` ప్రాంచైజీ సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజీలో హీరో అంటే అతడికి ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది.
బాలీవుడ్ `డాన్` ప్రాంచైజీ సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజీలో హీరో అంటే అతడికి ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. 1978 లో అమితాబ్ డాన్ ప్రాంచైజీలో తొలి హీరో అయితే అటుపై షారుక్ ఖాన్ మరో హీరోగా నటించాడు. వీళ్లిద్దరు నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. అప్పటి డాన్ ప్రాంచైజీ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా వెలిగిపోతుంది. అమితాబ్ తరం తర్వాత షారుక్ తరం తర్వాత హీరో ఎవరు? అవుతారు? అని చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతుంది.
తాజాగా ఆ సస్పెన్స్ కి తెరపడింది. మూడవ తరం డాన్ గా రణవీర్ సింగ్ ఎంపికయ్యాడు. డాన్ ప్రాంచైజీని తెరపైకి తెచ్చిన పర్హాన్ అక్తర్ మరోసారి దర్శకత్వం బాధ్యతలు తీసుకుంటున్నారు. వాస్తవానికి డాన్ -3 ఉంటుందని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అందులో హీరో ఎవరు అవుతాడా? దర్శకుడు మారే అవకాశం ఉందని ప్రచారంలోకి వచ్చింది. కానీ కెప్టెన్ బాధ్యతలు మాత్రం మరోసారి పర్హాన్ తీసుకు న్నాడు. తన మాత్రమే డాన్ ప్రాంచైజీకి సమన్యాయం చేయగలడని నిర్మాణ సంస్థలు భావించడంతో ఆయనే రంగంలోకి దిగుతున్నాడు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ నుంచి చిత్రాన్ని పట్టాలె క్కిస్తున్నట్లు తెలిసింది. ఇందులో డాన్ పాత్ర కోసం రణవీర్ సింగ్ ని ప్రత్యేక శిక్షణకు పంపతున్నారుట. విదేశాల్లో ప్రత్యేక శిక్షణతో పాటు అవసరమైన మేకోవర్ సిద్దం చేసి `డాన్ -3`ని రంగంలోకి దింపుతారని తెలు స్తోంది. ప్రస్తుతం రణవీర్ సింగ్ సింగం ఎగైన్ లో నటిస్తున్నాడు. అందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
కొన్ని రోజులుగా ఆ సినిమా షూట్ లో ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే కొంత గ్యాప్ అనంతరం డాన్ పనులు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రణవీర్ కి జోడీగా సీనియర్ బ్యూటీ కరీనాకపూర్ ని దించుతున్నట్లు వినిపిస్తుంది. ఇక `డాన్-3` పూర్తిచేసిన వెంటనే రణవీర్ సింగ్ `శక్తిమాన్` షూటింగ్ లో పాల్గొంటాడు. మరోవైపు ఆ సినిమా పనుల్లోనూ మేకర్స్ బిజీగా ఉన్నారు.