స్టార్‌ ఫ్యామిలీ గ్రూప్‌ హగ్ వైరల్‌

బాలీవుడ్‌ లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ ఫ్యామిలీగా వీరి ఫ్యామిలీ ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Update: 2024-09-28 11:01 GMT

బాలీవుడ్‌ స్టార్ రణబీర్ కపూర్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అతని భార్య ఆలియా భట్ ఆసక్తికర ఫోటోలను షేర్‌ చేసింది. రణబీర్‌ కపూర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాలా అందమైన ఫ్యామిలీ అంటూ రాహా తో కలిసి ఉన్న ఫోటోలకు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందం కేవలం రణబీర్‌ కపూర్‌ ఫ్యామిలీకే సొంతం అన్నట్లుగా అభిమానులు తెగ కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోలను లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ ఫ్యామిలీగా వీరి ఫ్యామిలీ ఉంటుంది అనడంలో సందేహం లేదు.


చిన్నారి రాహా తో ఈ మధ్య కాలంలో రణబీర్‌ కపూర్ తరచు కనిపిస్తున్నారు. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా రాహ ఫేస్‌ మరింత అందంగా కనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో రాహ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి. రణబీర్‌ కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆలియా షేర్‌ చేసిన ఈ ఫోటోలు ఎప్పటికీ మర్చి పోలేం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, రాహ ఫ్యామిలీ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. వీరు ముగ్గురు ఒక చెట్టుకు గ్రూప్‌ హగ్‌ ఇవ్వడం మరింతగా ఆకర్షిస్తోంది.

రణబీర్‌ కపూర్‌ ఇటీవల యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన ఆ సినిమాలో చేసిన రొమాన్స్, హింస కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సందీప్‌ వంగ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్‌ గా యానిమల్ పార్క్ రానుంది. అయితే ఆ సినిమా ప్రారంభం కావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. రణబీర్‌ కపూర్‌ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా రామాయణంలో నటిస్తున్న విషయం తెల్సిందే. సాయి పల్లవి సీత పాత్ర లో కనిపించబోతున్న రామాయణం పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఆలియా భట్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తల్లి అయిన వెంటనే ఆలియా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే ఆలియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఆలియా మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒక సినిమా ఇదే ఏడాదిలో విడుదల అవ్వబోతుంది. ఇటీవల ఎన్టీఆర్ తో ఆమె కలిసి చేసిన ఇంటర్వ్యూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆలియా భట్ ఆర్‌ఆర్‌ఆర్ తో తెలుగు లో నటించింది. మళ్లీ ఆమె తెలుగు సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె ఎప్పుడు తెలుగు సినిమా చేస్తుంది అనేది చూడాలి.

Tags:    

Similar News