ఫోటో స్టోరి: ఫియర్‌లెస్ రాణీజీ
బాలీవుడ్ లో మాధురి ధీక్షిత్, కరిష్మా కపూర్ తర్వాత మళ్లీ ఆ రేంజులో పాపులరైన మేటి ప్రతిభావని రాణీ ముఖర్జీ. అందానికి అందం ప్రతిభతో రాణీ కుర్రకారు కలల రాణి అయింది.
బాలీవుడ్ లో మాధురి ధీక్షిత్, కరిష్మా కపూర్ తర్వాత మళ్లీ ఆ రేంజులో పాపులరైన మేటి ప్రతిభావని రాణీ ముఖర్జీ. అందానికి అందం ప్రతిభతో రాణీ కుర్రకారు కలల రాణి అయింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే, నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమాయణం సాగించిన రాణీ ముఖర్జీ అటుపై అతడితో లవ్ లైఫ్ లో పూర్తిగా సెటిలైంది. ఇప్పుడు తన కిడ్స్ పెంపకం వగైరా సంసార బాధ్యతలతో రాణీజీ బిజీ.
రాణీజీ ఇటీవల తిరిగి నటిగా పునరాగమనం చేసారు. మిసెస్ ఛటర్జీ vs నార్వే చిత్రంతో ఓటీటీలో తన అభిమానులను అలరించారు. ఇందులో దేబికా ఛటర్జీ పాత్రలో రాణీ నటించి మెప్పించారు. తన ఇద్దరు పిల్లల కస్టడీని తిరిగి పొందాలని నార్వే ప్రభుత్వంతో పోరాడిన సాగరిక భట్టాచార్య (నిజ జీవిత దేబికా) నిజ జీవిత కథలో రాణీజీ నటించారు. ఇది ఒక ఉన్నత స్థాయి కేసు. ఇది అంతర్జాతీయంగా హెడ్ లైన్స్ ని తాకిన స్టోరి. శక్తివంతమైన శత్రువు నార్వేకి వ్యతిరేకంగా తన పిల్లలను రక్షించే నిర్భయమైన పులిగా సాగరికను ఆవిష్కరించారు. దివంగత సుష్మా స్వరాజ్ - కార్యకర్త బృందా కారత్ సమయానుకూల జోక్యంతో సుదీర్ఘ కస్టడీ నుంచి పిల్లలు వారి తల్లితో తిరిగి కలుసుకోవడంతో ఈ సినిమా ముగుస్తుంది.
ఈ చిత్రంలో రాణీజీ అద్భుతమైన నటనతో కంబ్యాక్ అయిన తీరు చర్చనీయాంశమైంది. రాణి ఎక్కడ ఉన్నా రాణి. తనదైన నటనతో మైమరిపిస్తుంది. ఇక సోషల్ మీడియాల్లో రాణీ ముఖర్జీ అందమైన ఫోటోషూట్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా టైమ్ లెస్ బ్యూటీ రాణీజీ బ్లాక్ సూట్ లో అందంగా కనిపించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఫియర్ లెస్, దట్స్ హెర్ స్టైల్ అన్న క్యాప్షన్ తో ఈ ఫోటోలను రాణీజీ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
ఇంతకుముందు కపిల్ శర్మ షోలో తనను యశ్ చోప్రా తిట్టారని రాణీజీ వెల్లడించారు. దానికి కారణం వీర్ జారా సెట్లో షారూఖ్ వృద్ధ వేషం చూసి ముసిముసిగా నవ్వుకోవడమేనని వెల్లడించింది. నిజానికి SRK- రాణి రొమాంటిక్ చిత్రాల్లో జంటగా నటించారు. అయితే చోప్రా తెరకెక్కించిన వీర్-జారాలో, వారు తండ్రి -కుమార్తె వలె డైనమిక్‌గా నటించవలసి వచ్చింది. అందుకే యష్ చోప్రా సెట్‌లో రాణి తన ముసిముసి నవ్వులను ఆపుకోవడంలో ఇబ్బంది పడిందిట. వీర్-జారా 2004లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రీతి జింటా, కిరణ్ ఖేర్, మనోజ్ బాజాపీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, రాణి ముఖర్జీ చివరిసారిగా మిసెస్ ఛటర్జీ vs నార్వేలో కనిపించారు. ఆమె ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్-సిరీస్, ది రొమాంటిక్స్‌లో కూడా కనిపించింది.